ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని వివిధ మార్కెట్లలో కార్మికులుగా పనిచేస్తున్న మహిళలు వారి సమస్యల పట్ల నేడు 19వ డివిజన్ కార్పొరేటర్ ఓన్లీ భాస్కర్ ఆధ్వర్యంలో డివిజన్ లోని పార్కులో ఏర్పాటు చేసిన సమావేశానికి ఎమ్మెల్యే, బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నన్నపునేని నరేందర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మహిళా కార్మికులు మార్కెట్లలో ఎదుర్కొంటున్న సమస్యలు, జీవనోపాధి ఇతర సమస్యలను ఎమ్మెల్యే నరేందర్ కు వివరించారు.
ఈ సందర్భంగా స్పందించిన ఎమ్మెల్యే నరేందర్
వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి పరిష్కార మార్గం చూపుతామని గతంలో ప్రజల సమస్యలను ప్రభుత్వం మరియు అసెంబ్లీలో మాట్లాడి పరిష్కారం చూపడం జరిగిందని ఎమ్మెల్యే గుర్తు చేశారు.
ఎన్నికల అనంతరం మహిళా కార్మికులు అందరికీ కెసిఆర్ బీమా అందిస్తామని 18 సంవత్సరాల నుండి 57 సంవత్సరాల లోపు ఉన్న మహిళలందరికీ సౌభాగ్య లక్ష్మి ద్వారా 3000 రూపాయల భృతిని అందించబోతున్నామని మహిళా కార్మికుల సమస్యల పట్ల తాను కట్టుబడి ఉన్నానని ఎన్నికల అనంతరం ప్రతి సమస్యకు పరిష్కార మార్గం చూపే జిమ్మేదారి తనదని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
రాబోవు ఎన్నికల్లో నాకు మద్దతుగా నిలిచి కారు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఓని భాస్కర్, ఆర్టిఏ మెంబర్ గోరంట్ల మనోహర్, అధ్యక్షుడు ఈటెల ఉమేందర్, కార్మిక నాయకులు యాకయ్య బిఆర్ఎస్ నాయకులు గణిపాక సుధాకర్ అమ్మిరాజు, నూకల రాణి డివిజన్ ముఖ్య నాయకులు కార్మిక నాయకులు హాజరయ్యారు.


Post A Comment: