ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
హన్మకొండ జిల్లా లోని
పరకాల శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి గురువారం 15 నామినేషన్లు దాఖలైనట్లు రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్ తెలిపారు. బిజెపి అభ్యర్థి డాక్టర్ పగడాల కాళీ ప్రసాద్ రావు తన రెండో సెట్ నామినేషన్ వేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేవూరి ప్రకాష్ రెడ్డి రెండు సెట్ల నామినేషన్ ను సమర్పించారు. బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి రెండు సెట్లు నామినేషన్ వేశారు. చల్లా జ్యోతి బిఆర్ఎస్ పార్టీ నుండి నామినేషన్ వేశారు. భారత చైతన్య యువజన పార్టీ తరపున అబ్బాడి బుచ్చిరెడ్డి, స్వతంత్ర అభ్యర్థి గుండా రాము రెండు సెట్ల నామినేషన్ను, స్వతంత్ర అభ్యర్థి ఉప్పల శ్రీనివాస్ రెండు సెట్ల నామినేషన్లు వేశారు. ఎం.సి.పి. ఐ (యు) పార్టీ తరఫున గోనే కుమారస్వామి, పీపుల్స్ పార్టీ ఆఫ్ ఇండియా నుండి శనిగరపు రమేష్ బాబు, భారతీయ స్వదేశీ కాంగ్రెస్ నుండి దొంతుల శ్రావణ్ కుమార్, ఇండిపెండెంట్ అభ్యర్థిగా సోల్తి కిరణ్ కుమార్ గౌడ్ నామినేషన్లు వేసినట్టు రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్ వెల్లడించారు.


Post A Comment: