ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
28వ డివిజన్ లోని పాత బీట్ బజార్ లో ఎమ్మెల్యే, ప్రస్తుత బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నన్నపునేని నరేందర్ ప్రచారం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో బీట్ బజార్ లో దుకాణాదారులను స్వయంగా కలిసి కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచి మరో మారు గులాబీ సర్కారుకు హ్యట్రిక్ అందించాలని కోరుతూ ఓటు అభ్యర్థించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వనా తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉందని అభివృద్ధి సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ ముందంజలో ఉందన్నారు
కాంగ్రెస్ బిజెపి పార్టీని నమ్మి ప్రజలు మోసపోవద్దని కాంగ్రెస్ 11 పర్యాయాలు అధికారంలో ఉండి మనల్ని మోసం చేసి ప్రజలను ఓట్లుగా వాడుకొని పబ్బం గడిపారు.
బీజేపీ పార్టీ అనేది మతకల్లోలాలు సృష్టించి కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టి ఆగం చేస్తారు
కరోనా వచ్చినప్పుడు ఇప్పుడు వచ్చే నాయకులు ఒక్కరు మనకు కనపడలేదు
ఓ లారీ డ్రైవర్ కొడుకుగా నిరుపేద నుండి ఎదిగాను ఆ మూలాలు మరిచిపోను అందుకే పేద ప్రజలకు అండగా ఉండాలని 25వేల మందికి నిత్యావసర సరుకుల పంపిణీ చేసాను ఇప్పుడు ఈ బిటి బజార్ లో తిరుగుతుంటే ప్రతి ఒక్కరు వారికి నాకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ మాట్లాడుతూ నీకె ఓటేస్తాం అంటూ స్వచ్ఛందంగా నా వెంట తిరుగుతున్నారు ఈ ప్రాంత బిడ్డగా వారికి నాకున్న అనుబంధం అలాంటిది
ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ నుండి పోటీ చేసే వారు ఒకరు వంచనగిరి మరొకరు వర్ధన్నపేట మరి వీళ్లకు మన పరిస్థితి ఎట్లా తెలుస్తుంది
11సార్లు అవకాశం తీసుకున్న కాంగ్రెస్ ఎం అభివృద్ధి చేయలేదు కానీ ఇప్పుడు వచ్చి ఏమో చేస్తామంటూ కల్లబొల్లి మాటలు మాట్లాడుతున్నారు ఎలా నమ్ముతారు. తొడలు కొట్టి మీసాలు తిప్పే వాళ్ళను నమ్మితే ఆగం అయితము మన బిడ్డల జీవితాలు బాగుండాలి మన బిడ్డల ఎదుగుదల గురించి ఆలోచించాలి. అందుకే కాంగ్రెస్ వాళ్లు అజంజాహి మిల్స్ అమ్ముకుంటే కేసీఆర్ సంగం మండలంలో మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేసారు
గత ఎన్నికల్లో వ్యాపార వాణిజ్యలు ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటా అని చెప్పాను. ఆ దిశగా ముందుకు సాగాను ఇప్పుడు అదే విధంగా మీకు పని చేస్తాను. కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించండి.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ గందే కల్పన నవీన్,మాజీ మార్కెట్ చేర్మెన్ రమేష్ బాబు, ప్రముఖ వ్యాపారవేత్త మహ్మద్ అలీ,డివిజన్ అధ్యక్షులు మర్రి రవి,వ్యాపార వాణిజ్య పెద్దలు ముఖ్య నాయకులు హాజరయ్యారు.

Post A Comment: