ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 


హన్మకొండ ;                     

వరంగల్ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ స్థానానికి గురువారం 18 నామినేషన్లు దాఖలు అయినట్లు రిటర్నింగ్ అధికారి, హనుమకొండ రెవెన్యూ డివిజనల్ అధికారి ఎల్. రమేష్ తెలిపారు. జంగా రాఘవరెడ్డి కాంగ్రెస్ నుండి ఒకటి, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏ. ఐ. ఎఫ్. బి ) పార్టీ నుండి మరొక నామినేషన్ వేసినట్లు పేర్కొన్నారు. నాయిని రాజేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున రెండు సెట్ల నామినేషన్ను దాఖలు చేసినట్లు రిటర్నింగ్ అధికారి తెలిపారు.  బిజెపి నుండి రావు పద్మ తన నామినేషన్ ను కేంద్ర మంత్రి అశ్విని కుమార్ చౌబే, మాజీ మేయర్  డాక్టర్ టి.రాజేశ్వర్ రావు, మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావులతో కలిసి  రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాన్ని సమర్పించారు.  కాంగ్రెస్ పార్టీ నుండి డాక్టర్ నాయిని శ్రీ గోదాదేవి నామినేషన్ వేయగా , జన్ను మధుకర్ బిజెపి నుండి ఒక నామినేషన్, స్వతంత్ర అభ్యర్థిగా మరొక నామినేషన్ వేశారు. ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థి  కోగిల రూప తన రెండో సెట్ నామినేషన్ వేయగా, ఏ.ఎస్.పి పార్టీ నుండి సయ్యద్ షాజీ, విద్యార్థుల రాజకీయ పార్టీ నుండి సౌమ్య శ్రీ ఆకుతోట నామినేషన్ వేయగా, ఉల్లెంగల యాదగిరి కాంగ్రెస్ పార్టీ నుండి ఒకటి, స్వతంత్ర అభ్యర్థిగా మరొక నామినేషన్ను సమర్పించినట్లు రిటర్నింగ్ అధికారులు వెల్లడించారు.  స్వతంత్ర అభ్యర్థులు గుర్రం జక్కయ్య, ఫారుక్ అహ్మద్ హసన్, ఇమ్మడి రవి, సాయిని రవీందర్ లు నామినేషన్లు దాఖలు చేసినట్లు రిటర్నింగ్ అధికారి రమేష్ తెలిపారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: