మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి
రామగుండం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్.టి.పి.సి లోని ఆర్ఒ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ తరపున నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందచేసిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రాజ్ ఠాకూర్ ను. కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు పూనమాలతో శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ...
రామగుండం నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదాలతో నామినేషన్ వేశానని అన్నారు. అరాచక పాలన దోపిడి పాలన కొనసాగిస్తున్న బీఆర్ఎస్ పార్టీని తరిమి కొట్టడానికి ప్రజలు సిద్దమైనారని అన్నారు. ఈ ప్రాంత బిడ్డగా ఈ నగరాన్ని మహ నగరంగా తీర్చిదిద్దడమే నా లక్ష్యమని అన్నారు.. చేతి గుర్తుకు ఓటు వేసి నాకు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు.
అంతకు ముందు పవర్ హౌజ్ కాలనీ లోని శివాలయంలో మరియు గౌతమ్ నగర్ లోని సాయిబాబా దేవాలయంలో రాజ్ ఠాకూర్ ప్రత్యేక పూజలు చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు వివిధ విభాగాల అధ్యక్షులు, కార్యకర్తలు అదిక సంఖ్యలో పాల్గొన్నారు.


Post A Comment: