పెద్దపల్లి:గోదావరిఖని:నవంబర్:8:(మేడిగడ్డటీవీన్యూస్ ఛానల్):రామగుండం నియోజకవర్గం లో రోజురోజుకుకాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది,సంఘటిత అసంఘటిత కార్మిక విభాగం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు పెంచాల తిరుపతి ఆధ్వర్యంలో జిడికె 2ఎ ఇంక్లైన్ ఓవర్ మైన్ కిరణ్ తో పాటు 100మంది సింగరేణి కార్మికులు రామగుండం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకొని పార్టీలో చేరారు.ఈ సందర్బంగా రాజ్ ఠాకూర్ మాట్లాడరు...అండర్ గ్రౌండ్ గనులువస్తాయి ఉద్యోగాలు వస్తాయి అనుకుంటే ఓపెన్ కాస్ట్ లు చేసి ఉద్యోగులను తగ్గిస్తున్నరాని అన్నారు.సింగరేణిని ప్రైవేట్ పరం చేయాలని చుస్తుందాని,ఎంతటి పోరాటం చేయడానికైన వెనకడుగు వెసెది లేదు ప్రైవేట్ పరం కనివ్వం అని అన్నారు..ఒక్క సారి అలోచన చేయండి..ఈ ప్రాంతంఎలా దోపిడి జరుగుతుందో అలోచన చేయాలని అన్నారు.. ప్రజా హితం కోరుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు..దేశనికి వెలుగులు ఇచ్చిన సింగరేణి కార్మికులకు ఇన్కాంటాక్స్ తో పాటు ఇతర ట్యాక్స్ లు మినహయింపు చేయాలని రాహుల్ గాంధీ చెప్పారని,సైనికుడికి ఇచ్చేగౌరవం ఇవ్వాలని అన్నారు.యువ మిత్రులందరు ఉద్యమించాలి,దోపిడి పాలనను ప్రశ్నించాలని అన్నారు.కాంగ్రెస్ పార్టీ కార్మిక బంధువులకు అండగా ఉటుందాని,ఒక్క అవకాశం చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు..కలిసి నడవడానికి కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి కృతఙ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,కార్పోరేటర్లు,వివిధ విభాగాల అధ్యక్షులు,కార్మికులు పాల్గొన్నారు.

Post A Comment: