జుక్కల్ మండల్ ప్రతినిధి / క్రిందిదొడ్డి నాగరాజ్


జుక్కల్ న్యూస్ ;

బసవేశ్వరుడు: క్రీ.శ. 11వ శతాబ్దమువాడు. కర్ణాటకలో హింగుళేశ్వరబాగ్ వాడి అనే గ్రామంలో జన్మించాడు. తండ్రి నాగరాజు, తల్లి మదాంబిక. బసవేశ్వరునకు బాల్యంలోనే సంగమయ్య అను సన్యాసి లింగధారణ చేసి దీక్ష ఇచ్చాడు. కళ్యాణం ప్రభువైన బిజులుని వద్ద మంత్రిగా ఉన్న బలదేవుని కుమార్తె నీలాంబిక (గంగాంబిక)ను బసవేశ్వరుడు వివాహం చేసుకున్నాడు. బసవేశ్వరుడు కూడా బిజ్జలుడు వద్ద కొంతకాలం ప్రధానమంత్రిగా ఉన్నాడు. అయితే బసవడు రాజకీయంగా లభించిన ఈ అవకాశాన్ని ధర్మప్రచారానికి ఉపయోగించుకున్నారు. కల్యాణపట్టణంలో బసవేశ్వరుడు అనుభవ మంటపం అనే విద్వత్ సభను నిర్వహించి ధర్మవిచారాన్ని జరుపుతుండేవాడు.అక్కమహాదేవి వంటి భక్తులెందరో ఈ సభలో ఉండేవారు. బసవని భక్తి యోగాన్ని విని కాశ్మీర దేశరాజు సతీసమేతంగా వచ్చి కాయమే కైలాస మని గ్రహించి శ్రామిక జీవితాన్ని గడిపాడు. బసవేశ్వరుడు వీరశైవం జాతి కుల మతాలకతీతమైంది.అక్కమహాదేవి వంటి భక్తులెందరో ఈ సభలో ఉండేవారు. బసవని భక్తి యోగాన్ని విని కాశ్మీర దేశరాజు సతీసమేతంగా వచ్చి కాయమే కైలాస మని గ్రహించి శ్రామిక జీవితాన్ని గడిపాడు. బసవేశ్వరుడు వీరశైవం జాతి కుల మతాలకతీతమైంది. భక్తులంతా ఈశ్వర కులస్థులని పరమేశ్వరుని గోత్రానికి చెందినవారని సిద్ధాంతీకరించి జాతిని సమైక్యపరచింది. బసవేశ్వరుడు బోధించినది. వీరశైవ వాంతం. ఉపాస్యదైవం శివుడే అయినా ఇదొక ప్రత్యేకమార్గం. దయ, ప్రేమ బసవని శైవానికి మూలసూత్రాలు. కాయకం కైలాసమయ్యా అన్నది తత్వం. హింసాత్మకమైన యజ్ఞయాగాదులను ప్రతిఘటించి ఈశ్వరుడు భక్తిప్రియుడని చాటాడు. వీరశైవం శివజీవైక్యాన్ని బోధిస్తుంది. బసవడు చేసిన ఆర్థిక, రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక మతసంస్కరణలు దక్షిణాపథంలో అపూర్వమైన విప్లవాన్ని తెచ్చాయి. ఒకసారి మహాత్మాగాంధీ హుబ్లీలో ప్రసంగిస్తూ నేను చేయదలచుకున్నదంతా 800సం.రాల పూర్వం బసవేశ్వరుడు చేశాడు అని చెప్పాడట.బసవేశ్వరుడు నందికేశ్వరుని అవతారమని శ్రద్ధాళువుల విశ్వాసము. బాల్యం నుండి ప్రఖర శివభక్తుడు. ఈ శివ భక్తి పారమ్యత వల్లనే ఉపనయనాది కర్మలను నిషేధించి వీర మాహేశ్వరుడే నా తల్లి తండ్రి అని చాటాడు. వారే నాకు శుభములను సమకూరుస్తారని చెప్పారు. బసవేశ్వరుడు తన జీవనకాలంలో కర్ణాటక, ఆంధ్ర ప్రాంతాలలో వీరశైవాన్ని స్థాపించి భారతీయులలో ఏకతను ప్రతిపాదించి ప్రేమ సూత్రంతో బంధించిన జగజ్యోతి. భక్త భండారి బసవేశ్వరుడు. ఇట్టి కార్యక్రమంలో  శివలింగ శివాచార్య మహారాజ్ తమ్మలూరు కర్  మార్గదర్శనం చేశారు.గ్రామ పెద్దలు మారుతి శేట్కర్, చందరు పటేల్, సంగాయప్ప స్వామి, కుమకాంత్ పాటిల్, సంజు స్వామి, బస్వరాజ్ బీరధర్ ఇతర గ్రామ యువకులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: