పెద్దపల్లి:రామగిరి:అక్టోబర్:27:(మేడిగడ్డ టీవీ న్యూస్ ఛానల్):
రామగిరి మండలం బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు సమావేశం:మారుమోగిన మండల సమావేశం,రామగిరి మండల్ లోని ఓ ఫంక్షన్ హాల్ లో శుక్రవారం పార్టీ ముఖ్య కార్యకర్తల,నాయకుల సమావేశనికి మంథని నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి,భారత రాష్ట్ర సమితి పార్టీ ఇన్చార్జి పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు గులాబీ సైన్యానికి,దిశ-నిర్దేశం చేశారు,ఈ సందర్భంగా వారు మాట్లాడారు,రాబోయే ఎమ్మెల్యే ఎలక్షన్లలో కాంగ్రెస్ వారు మాయమాటలతో డబ్బు సంచులతో ఓట్లకోసం వచ్చి,నక్క విన్యాసాలు ప్రదర్శిస్తారని వారు ప్రవేశపెట్టిన ఆరు పథకాలు కర్ణాటకలో కారు చీకటైందని అక్కడి ప్రజలు తలలు బాదుకుంటారని,పోయినసారి ఆదమరిషి శ్రీధర్ బాబును గెలిపించుకుంటే అదే పరిస్థితి ఇక్కడ(మంథనిలో)తలెత్తిందని,అలాకాకుండా జాగ్రత్త పడాలని ప్రజలకు వివరించాలని,సీఎం కేసీఆర్ ప్రజలకు ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు,బీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోను ప్రతి గడపగడపకు తీసుకెళ్లాలని సూచించారు,అంతకుముందు పార్టీ సర్పంచులు,ఎంపీటీసీ లు,జడ్పిటిసి,టీబీజీకేఎస్ నాయకులు మాట్లాడారు,మీ గెలుపే ధ్యేయంగా పనిచేస్తామని ఏకదాటి నినాదంతో ప్రసంగించారు,కార్యకర్తలు ఉత్సాహంతో జై తెలంగాణ జై పుట్ట మధుఅన్న,కారు గుర్తుకే మన ఓటు,అంటూ నినాదించారు,ఈ సమావేశంలో నాయకులు,నాయకురాలు,అధిక సంఖ్యలో కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మేడిగడ్డ టీవీ న్యూస్ ఛానల్ బ్యూరో ఆఫ్ తెలంగాణ:పుట్ట రాజన్న..

Post A Comment: