ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్ధినీ విద్యార్థులు మార్చి 2024 లో జరుగనున్న వార్షిక పరీక్షలకు ఫీజు నవంబర్ 14 తేదీ లోగా ఎలాంటి అపరాధ రుసుము లేకుండా చెల్లించాలని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్ షెడ్యూల్ విడుదల చేశారు. ఈ నెల 26 నుండి నవంబర్ 14 వరకు రెగ్యులర్ విద్యార్థులు 510,ఒకేషనల్ విద్యార్థులు 730 రూపాయలు చెల్లించాలని సూచించారు. నవంబర్ 16 నుండి 23 వరకు వందరూపాయల,23 నుండి డిసెంబర్ 4వరకు ఐదు వందల రూపాయల,డిసెంబర్ 6 నుండి 13 వరకువెయ్యి రూపాయల,15నుండి డిసెంబర్ 20 వరకు రెండు వేల రూపాయల అపరాధ రుసుము చెల్లించి ఫీజు కట్టాలన్నారు.

Post A Comment: