ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;ఎన్నికల లలో పాల్గొనే పోలింగ్ సిబ్బంది కి సంబంధించిన మొదటి దశ ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేసినట్లు కలెక్టర్, ఎన్నికలఅధికారి సిక్త పట్నాయక్ తెలిపారు. గురువారం కలెక్టరేట్ లో నిక్ సెంటర్ లో కలెక్టర్ ర్యాండ్ మైజషన్ ప్రక్రియ చేపట్టారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా లోని పోలింగ్ సిబ్బందిని మొదటి దశ ర్యాండ్ మైజషన్ ద్వారా.4084 మంది ని కేటాయించి నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం లో సిపిఓ సత్యనారాయణ రెడ్డి, నిక్ అధికారి విజయకుమార్, డిఈఓ అబ్దుల్ హై తదితరులు పాల్గొన్నారు.
అంతకు ముందు కలెక్టర్ ఉదయం తేజస్వి హై స్కూల్ లో గల ఆక్సిలరీ పోలింగ్ కేంద్రన్ని, పింగళి కాలేజీ లో మహిళా పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. మౌలిక వసతుల గురించి ఆరాతీ శారు. ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ ఓటర్లు తమ ఓటును నిర్భయంగా వినియోగించుకోవడానికి అవసరమైన సౌకర్యాలను కల్పించాలన్నారు.అన్ని పోలింగ్ కేంద్రాల్లో వసతులు, సౌకర్యాలు కల్పించాలి అన్నారు విద్యు త్, తాగునీరు సౌకర్యాలు, ర్యాంపు తదితర వసతులను కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు.

Post A Comment: