ముఖ్య సంచాలక్ / అనపర్తి సాయితేజ
బీజేపీ ఎన్నికల ప్రచారంలో ముందుకు కొనసాగుతోంది. బీజేపీ అగ్రనాయకులతో ఎన్నికల ప్రచారం చేస్తూ.. బీజేపీ కార్యకర్తల్లో జోష్ తీసుకువస్తోంది. ఈ క్రమంలో ఇవాళ సూర్యాపేట జిల్లాలో జరిగే జనగర్జన బహిరంగ సభను నిర్వహించింది. దీనికి కేంద్ర మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఈ సభలో ప్రసంగిస్తున్నారు. తెలంగాణ బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు ఎన్నికల ప్రచారంలో దిశానిర్దేశం చేస్తున్నారు. జనగర్జన సభలో అమిత్ షా బీఆర్ఎస్ పార్టీ పలు విమర్శలు చేస్తున్నారు. బీఆర్ఎస్ తొలి జాబితా వచ్చిందని.. త్వరలోనే తుది జాబితా వస్తోందని తెలిపారు. జనసేన పార్టీతో పొత్తు విషయం గురించి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లాలో ఉన్న నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను బరిలోకిదించిందని తెలిపారు. ఈ సభ ఏర్పాట్లలను గోషామాల్ఎమ్మెల్యేరాజాసింగ్ పరిశీలించారు.

Post A Comment: