మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
అంతర్గాం మండల ఆరోగ్య ప్రాథమిక కేంద్రం సూపరిండెంట్ కు సి పి ఐ యం ఎల్ ప్రజాపంధా అనుబంధ పి ఓ డబ్ల్యూ-పివైఎల్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు*ఈ సందర్భంగా పి ఓ డబ్ల్యూ రాష్ట్ర నాయకురాలు కోడిపుంజుల లక్ష్మి, పి వై ఎల్ రాష్ట్ర నాయకులు భూషణవేణి కృష్ణ, జిల్లా అధ్యక్షులు పెండ్యాల రమేష్ మాట్లాడుతూ
వాతావరణ మార్పుల వల్ల కలిగే సీజనల్ వ్యాధులకు మందుల కొరత లేకుండా చూడాలని,
అదేవిధంగా డాక్టర్స్ మరియు మెడికల్ సిబ్బందిని అందుబాటులో ఉంచాలని వాతావరణ మార్పుల వల్ల కలిగే అనారోగ్య సమస్యలు అయినటువంటి కలరా, *టైఫాయిడ్*డెంగ్యూ *మలేరియా వ్యాధులకు సంబంధించిన మందులను అందుబాటులో ఉంచాలని, అలాగే వ్యవసాయ పనులు ప్రారంభ దృష్ట్యా పాము, తేలుకాటు,లకు సరైన మందులు అందుబాటులో ఉంచి ,తగు డాక్టర్స్ ని సిబ్బందిని అప్రమత్తం చేయాలని సూపరింటెండెంట్ ను కోరడం జరిగింది.
*ఈ కార్యక్రమంలో పి ఓ డబ్ల్యూ రాష్ట్ర కమిటి సభ్యురాలు కోడిపుంజుల లక్ష్మి, పి వై ఎల్ రాష్ట్ర కమిటీ సభ్యులు భూషణ వేణి కృష్ణ, పెద్దపల్లి జిల్లా కమిటీ అధ్యక్షుడు పెండ్యాల రమేష్, కట్టా తేజేశ్వర్, బుధవారపు దేవన్న తదితరులు పాల్గొన్నారు...్

Post A Comment: