చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
వచ్చే సాధారణ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని భువనగిరి మాజీ పార్లమెంట్ సభ్యుడు బూర నర్సయ్య గౌడ్ అన్నారు. యాదాద్రి
భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో మంగళవారం నిర్వహించిన మేర బూత్ సబ్సే మజ్ బూత్ ముగింపుసభ కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చౌటుప్పల్ మండల వ్యాప్తంగా నిర్వహించిన ఇంటింటికి బీజేపీ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాలను కార్యకర్తలు ప్రజలకు వివరించారని తెలిపారు. తెలంగాణలో
నూటికి నూరు శాతం బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం తధ్యమ
న్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రామనగోని శంకర్,
దాసోజు బిక్షమాచారి, దూడలు బిక్షంగౌడ్, ఊడుగు వెంకటేశం గౌడ్, వనం ధనంజయ, కర్ణాటక రాష్ట్ర అధికార ప్రతినిధి చైతన్య పాల్గొన్నారు.


Post A Comment: