మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
సమాజాభివృద్ధిలో బీసీల భాగస్వామ్యం వెలకట్టలేదని జాతీయ బీసీ సంక్షేమ సంఘం పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు తాడూరి శ్రీమన్నారాయణ పేర్కొన్నారు. బుధవారం పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గం జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శిగా గాజుల రమేష్ ను నియమించినట్లు ఆయన తెలిపారు . సంఘం అభివృద్ధిలో బీసీలను చైతన్యం చేయడంలో రమేష్ తన వంతు సహకారం అందించాలని సూచించారు. రాజ్యసభ సభ్యులు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పజెప్పినందుకు గాజుల రమేశ్ కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి పొన్నం ప్రసాద్ గౌడ్ రామగుండం నియోజకవర్గ అధ్యక్షుడు వింజమూరి సురేష్ , రామగుండం కార్పొరేషన్ అధ్యక్షుడు గుండారపు శ్రీనివాసు, పలువురు బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు.

Post A Comment: