మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
ఎన్టీపీసీ పీకే రామయ్య కాలనీలో ఇంటి స్థలాలు సాధించే వరకు పోరాటం ఆగదు సీపీఎం జిల్లా కార్యదర్శి వై యాకయ్య ** సీపీఎం ఎన్టీపీసీ రామగుండం ఏరియా కమిటీ సమావేశం ఎన్టీపీసీ సీఐటీయూ కార్యాలయంలో ఎన్ శంకర్ అధ్యక్షతన జరిగింది.సమావేశానికి సీపీఎం జిల్లా కార్యదర్శి వై యాక య్య హాజరై మాట్లాడుతూ ఎన్ టి పి సి ఏరియా ఇందిరమ్మ కాలనీ,పీ కే రామయ్య కాలనీ ఏరియా లో ఇండ్ల స్థలాల కోసం గుడిసెలు వేసుకుని చేస్తున్న పోరాటం 100 రోజులు దాటింది ,తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చని కారణంగానే సీపీఎం ఇండ్ల స్థలాల పోరాటం చేపట్టిందనియాన్నరు.రామగుండం కార్పోరేషన్ పరిదిలో 6000 కు పైగా ఇండ్ల స్థలాల దరఖాస్తులు రామగుండం తహశీల్దార్ కు అందించామని స్థానిక ఎమ్మెల్యే చందర్ కు కలెక్టర్ కు,50 మంది కార్పొరేటర్లు కువినతి పత్రాలు ఇచ్చామని ,అర్హులైన వారందరికీ ఇండ్ల స్థలాలు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.కబ్జాకు గురవుతున్న ప్రభుత్వ భూమినీ మరియు అక్రమ కట్టడాలను చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని పేదో ల్లు గుడిసెలు వేసుకుంటే మాత్రం రెవెన్యూ అధికారులు కూల్చి వేస్తున్నారుఅని అన్నారు.ప్రభుత్వం తమ పద్ధతి మార్చుకోవాలని ,ధరకాస్తు దారులందరి కి ఇండ్ల స్థలాలు పట్టాలు ఇవ్వాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేసారుఇండ్ల స్థలాలు సాధించే వరకు పోరాటం ఆగదని అన్నారు..
Home
Unlabelled
ఎన్ టి పి సి పీకే రామయ్య కాలనీలో పేదలకు ఇండ్ల స్థలాలు ఇచ్చేవరకు పోరాటం ఆగదు సిపిఎం జిల్లా కార్యదర్శి వై యాకయ్య..
Post A Comment: