మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

రాష్ట్రవ్యాప్తంగా గ్రామపంచాయతీ కార్మికుల జేఏసీ పిలుపుమేరకు జులై ఆరవ తేదీ నుంచి జరిగే నిరవధిక సమ్మెను కార్మికులందరూ సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని ఏ ఐ టి యు సి జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్, బి ఆర్ ఎస్ కె వి జిల్లా ఉపాధ్యక్షుడు, సి ఐ టి యు నాయకులు రమేష్ పిలుపునిచ్చారు, రెబ్బెన మండలం గ్రామపంచాయతీ కార్మికుల జేఏసీ సమావేశం రెబ్బెన కేంద్రంలో నిర్వహించడం జరిగింది,ముందుగా ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గ్రామపంచాయతీ కార్మికుడు మానే దత్తు మరణించినందుకు జేఏసీ ఆధ్వర్యంలో రెండు నిమిషాలు మౌనం పాటించడం జరిగింది ,అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 50,000 మంది గ్రామపంచాయతీ కార్మికులు చాలీచాలని వేతనాలు తీసుకుంటూ శ్రమ దోపిడీకి గురవుతున్నారని అన్నారు,ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామపంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు అలాగే పిఆర్సి 30% పెంచాలని పిఆర్సి మినిమం వేస్ ప్రకారం 19000 జీతం చెల్లించాలని డిమాండ్ చేశారు జీవో నెంబర్ 60 ప్రకారం స్వీపర్లకులకు 15,600 పంపు ఎలక్ట్రీషియన్,ఆపరేటర్లు డ్రైవర్లు కారోబార్ బిల్ కలెక్టర్లు 19500 ,కారోబాల్ బిల్ కలెక్టర్లను సహాయ కార్యదర్శిగా నియమించాలని డిమాండ్ చేశారు ,జీవో నెంబర్ 51 ను సవరించాలని మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని పాత కేటగిరీలన్ని యధావిధిగా కొనసాగించాలని కోరారు విధినిర్వహణలో మరణించిన పంచాయతీ కార్మికునికి 10 లక్షల నష్టపరిహాలని ప్రభుత్వం ఇవ్వాలని దీనిని పోస్ట్ ఆఫీస్ బీమా పథకం ద్వారా అమలు చేయాలని డిమాండ్ చేశారు మరణించిన కార్మిక కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం అని ఇవ్వాలని అన్నారు ప్రతి గ్రామపంచాయతీ కార్మికునికి ఈఎస్ఐ పీఎఫ్ సౌకర్యం ప్రమాద బీమా గ్రాట్యూటీ గుర్తింపు కార్డు ఇవ్వాలని దహన సంస్కారాలకు 30 వేల ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు ఎనిమిది గంటల పని విధానాన్ని అమలు చేయాలని సెలవులు వారాంతపు సెలవులు పండుగ సెలవులు జాతీయ ఆర్జిత సెలవుల దినాలను అమలు చేయాలని అన్నారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కులం రద్దు చేయాలి గ్రామపంచాయ సిబ్బందికి అన్ని కార్మిక చట్టాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు కార్మికులపై వీధింపులు అక్రమ తొలిగింపులు వెంటనే ఆపివేయాలని డిమాండ్ చేశారు జూలై ఆరవ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా జరిగే సమ్మెలో జిల్లాలోని గ్రామపంచాయతీ కార్మికులు ఐక్యంగా పాల్గొని విజయవంతం చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ మండల కార్యదర్శి దుర్గం వెంకటేష్,నాయకులు శంకర్,దేవాజి,లాలూ సింగ్,కిషన్,లక్ష్మీ తోపాటు తదితరులు పాల్గొన్నారు

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: