మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

ఇండ్లు ఇళ్ల స్థలాల సమస్యల పరిష్కారం కోసం పెద్దపల్లి జిల్లా కలెక్టర్  కార్యాలయం దగ్గర మహాధర్న నిర్వహించాలని తెలంగాణ ప్రజాసంఘాల పోరాట వేదిక పిలుపునిచ్చారు కామ్రేడ్ వి నాగమణి అధ్యక్షులు అధ్యక్షతన ఇంద్రమ్మ కాలనీ, పీకే రామయ్య కాలనీ ఇళ్ల స్థలాల పోరాట కేంద్రాల బాధ్యుల సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో సిఐటియు రామగుండం ఏరియా కమిటీ కార్యదర్శి మరియు ఇందిరమ్మ కాలనీ ఇండ్ల స్థలాల సాధన రెండవ కేంద్రం కన్వీనర్ కామ్రేడ్ ఎం రామాచారి  మాట్లాడుతూ మున్సిపల్ కార్పొరేషన్లో పవర్ హౌస్ కాలనీ, ఇందిరమ్మ కాలనీ, పీకే రామయ్య కాలనీ, జంగాలపల్లి ఈ నాలుగు కేంద్రాలలోనీ ప్రభుత్వ భూములలో గత మూడున్నర నెలలుగా పేదలు గుడిసెలు వేసుకుని పోరాటం చేయడం జరుగుతుంది. ఇప్పటికీ అనేకసార్లు తాసిల్దార్ మరియు జిల్లా కలెక్టర్ కు ఎనిమిది వేల పైన దరఖాస్తు పత్రాలు ఇచ్చి, ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరడం జరిగింది. అంతేకాక సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా ఆధ్వర్యంలో అనేక వినతి పత్రాలు ఇచ్చి కలెక్టర్ కార్యాలయం ముందు మరియు తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి మూడు నాలుగు నెలలు గడిచిన ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేకపోవడం విచారకరం. ఇప్పటికైనా ప్రభుత్వం రెవెన్యూ అధికారులు స్పందించి వెంటనే నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని, గుడిసెలు వేసుకున్న వారందరికీ 125 గజాలు భూమి కేటాయించాలని, నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షలు, కేంద్ర ప్రభుత్వం పది లక్షల రూపాయలు ఇవ్వాలి. నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లన్నీ అర్హులైన పేదలకు కేటాయించాలి. మిగిలినవి నిర్మాణాలు తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు జూలై మూడో తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరుగు మహాధర్నాలో మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పేదలందరూ అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో రెండవ మరియు మూడవ భూపోరాట కేంద్రం బాధ్యులు ఎన్ బిక్షపతి, సిహెచ్ ఉపేందర్,  వి నాగమణి పాల్గొన్నారు.. 

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: