చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్ 

చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలో చేపట్టిన ఇంటింటికి గ్యాస్ పర్మిషన్ లో తప్పుడు. నివేదికలు ఇచ్చి మున్సిపల్ కి సుమారు 3 నుండి 4 కోట్ల రూపాయల నష్టాన్ని కలిగిస్తున్న సదరు కాంట్రాక్ట్ పనులు నిలిపివేయాలని భారతీయ జనతా పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ పోలోజు శ్రీధర్ బాబు అన్నారు. శుక్రవారం చౌటుప్పల్ మున్సిపల్ లో మెగా గ్యాస్ కంపెనీ వారు ఇంటింటికి సీఎన్జీ గ్యాస్ ఇచ్చే విషయంలో మున్సిపల్ ద్వారా పరిమిషన్ పొంది పనులు చేపట్టినారు. ఇట్టి పర్మిషన్ సంబంధించి అవినీతి జరిగినట్టుగా అనుమానాలు ఉన్నాయని. ఇట్టి పర్మిషన్ పై పునర్ సమీక్షించాలని భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్లు మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా భాజపా మున్సిపల్ ఫ్లోర్ లీడర్ పోలోజు శ్రీధర్ బాబు మాట్లాడుతూ..చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో ఈ మధ్యకాలంలో మెగా గ్యాస్ వారు మున్సిపాలిటీలో ఉన్న 20 వార్డులల్లో 5 నుండి 12 కిలోమీటర్ల పొడవు రోడ్లను తవ్వి, ఇరువైపులా గ్యాస్ లైన్లను తీయడంతో ఒక వార్డుకు 10 నుండి 20 కిలోమీటర్ల వరకు గ్యాస్ లైన్ వేస్తున్నారని.పూర్తి మున్సిపాలిటీలో 250 నుండి 300 కిలోమీటర్ల గ్యాస్ లైన్ ఏర్పాటు చేయడం జరుగుతుండడంతో పర్మిషన్లో కేవలం 130 కిలోమీటర్లు మాత్రమే మెగా గ్యాస్ కంపెనీ వారు చూపించారన్నారు. ఇందుకు గాను మెగా గ్యాస్ కంపెనీ వారు ఒక కోటి 50 లక్షలు మాత్రమే మున్సిపాలిటీకి చెల్లించారని . గతంలో భారత్ నెట్వర్క్ వారు ఏర్పాటు చేసినటువంటి కేబుల్ పనుల్లో 4.6 కిలోమీటర్లకు 14 లక్షల 65 వేల రూపాయలు ఫీజు విధించిన మున్సిపాలిటీ అధికారులు, 300 కిలోమీటర్లు పైప్ లైన్ ఏర్పాటు చేస్తున్నటువంటి మెగా గ్యాస్ కంపెనీ వారికి మాత్రం కేవలం ఒక కోటి 50 లక్షలు మాత్రమే ఫీజు విధించడం విడ్డూరం అన్నారు. ఇట్టి లెక్క ప్రకారం సుమారు 3 నుండి 4 కోట్ల రూపాయాలు మున్సిపల్ ఆదాయానికి గండి పడిందన్నారు. గతంలో విధులు నిర్వర్తించిన కమిషనర్ కె సరింహా రెడ్డి,మున్సిపల్ చైర్మన్ కనుసన్నల్లో ఇట్టి పూర్తి తతంగం జరిగిందని ఆరోపించారు. వారు పరోక్ష లబ్ది పొందడానికి ప్రజల ఆదాయానికి గండి కొట్టడం ఎంతవరకు సమంజసమని పేర్కొన్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు ఇట్టి పనులను తక్షణమే నిలుపుదల చేసి, పర్మిషన్ లో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ చేపట్టాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో భాజపా కౌన్సిలర్ కొయ్యడ సైదులు, భాజపా నాయకులు కామిశెట్టి భాస్కర్, సందగళ్ల సతీష్, తదితరులు పాల్గొన్నారు.,

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: