మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం నియోజకవర్గ ఇన్చార్జ్ పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మక్కాన్సింగ్ రాజ్ ఠాగూర్ ఆదేశాల మేరకు ఈరోజు అంతర్గాం మండలంలో అంతర్గాం చౌరస్తాలో మండల ఇంచార్జ్ అధ్యక్షులు పెండ్రు హనుమాన్ రెడ్డి ఆధ్వర్యంలో భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ జన్మదినo సందర్భంగా కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమాన్ని ఉద్దేశించి అంతర్గాం మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సింగం కిరణ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ బావి భారత ప్రధాని రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు చేపట్టినటువంటి భారత్ జోడో కార్యక్రమం 145 రోజులు 12 రాష్ట్రాలు మీదుగా 3970 కిలోమీటర్లు పాదయాత్ర చేసి దేశం లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుంటూ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ప్రజల సమస్యలు అన్ని పరిష్కరిస్తామని మనోధైర్యాన్ని కల్పిస్తూ కొనసాగిన జూడో యాత్ర పూర్తయిన వెంటనే ప్రజలు చైతన్యవంతమై కర్ణాటక ఎలక్షన్లో భారీ విజయాన్ని రాహుల్ గాంధీ కి ఇచ్చారని విషయాన్ని గుర్తు చేస్తూ,జొడో స్ఫూర్తితో రామగుండం నియోజకవర్గం లో పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు రాజ్ ఠాకూర్ చేపట్టిన హాత్ సే హాత్ జొడో యాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకుంటూ బిఆర్ఎస్, బిజెపి అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతూ సాగుతున్న యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలియజేస్తూ రామగుండం నియోజకవర్గం ప్రజా సమస్యలపై అనునిత్యం అలుపెరుగని పోరాటం చేస్తున్నటువంటి రాజ్ ఠాకూర్ ను ఎమ్మెల్యేగా గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రామగుండం నియోజకవర్గ ప్రజలపై ఉందన్నారు...
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఆవుల గోపాల్ యాదవ్ , మాజీ ఎంపీటీసీ బొడ్డు లింగమూర్తి ,ఉమ్మడి మాజీ మండల అధ్యక్షులు ఆర్కుటి రాజమల్లు యాదవ్, అంతర్గాం పట్టణ అధ్యక్షులు ఓల్లపు స్వామి, మూర్మూరు గ్రామ అధ్యక్షుడు గొర్రె చందు,ఎల్లంపల్లి గ్రామ అధ్యక్షులు శ్రీకాంత్, అంతర్గం మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఒల్లపు సాయికుమార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గజ్జల నాగరాజు,తుల మాధవరావు, కాంపల్లి సంతోష్, అప్పాలా రాజేందర్ గాండ్ల లింగయ్య యువజన కాంగ్రెస్ నాయకులు కొత్తకొండ సంతోష్,సంకరి అనిల్,ధరణి రాహుల్,కోతకొండ అజయ్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు...
Post A Comment: