మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
పాలకుర్తి, అంతర్గ్రామ్ మండలాల్లోని పలు గ్రామాల్లో పర్యటించిన *డీసీసీ అధ్యక్షులు *మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ మాట్లాడుతూ కొత్తపెల్లి, తక్కల పెల్లి, గుడిపెల్లి, పుట్నూర్, జయ్యారం, కుక్కల గూడూరు, మద్దిరాల, పొట్యాల, ఆకేనపల్లి, బ్రాహ్మణపల్లి, సోమనపల్లి గ్రామాలతో పాటు పలు గ్రామాల ఐకేపీ సెంటర్స్ లో పోసిన *వరి ధాన్యం భారీగా కురుస్తున్న వర్షాలకు తడిసి మొలకలస్తున్నాయి ఒక ప్రక్క ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యం *అధికార ప్రభుత్వంతో కుమ్మకైన*ట్లు ప్రకృతి కన్నెర్ర చేసి భారీ వర్షాలతో రైతన్నలను అతలాకుతలం చేస్తుంటే మరో ప్రక్క అధికార పార్టీ నేతలు ఆత్మీయ కలయికల పేరుతో దావతులు చేసుకుంటుంటే *నేడు దేశానికి అన్నం పెట్టే రైతన్న కంట్లో నుండి నీరు కాదు రక్తం ప్రవహిస్తున్నది
ఎక్కడిక్కడ సొసైటీ *CE అధికార్లతో మాట్లాడుకుంటూ రైతు పడుతున్న గోస చూడలేక జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తూ ఇవ్వాళా అకాల వర్షానికి తడిసిన వరి దాన్యాన్ని చూస్తూ రైతన్న విలవిల లాడుతుండు, కలెక్టర్ మీరు మానవతా దృక్పదంతో ఆలోచించించి తడిసిన దాన్యమైన తాలున్న లేకున్నా రంగుమారిన దాన్యమైన ఎలాంటి తరుగు లేకుండా పూర్తి స్థాయిలో కొనుగోలు అయ్యే విదంగా సంబంధిత అధికార్లకు ఆర్డర్ పాస్ చేయాలనీ తెలియజేస్తూ ఇంకా ఎక్కడైనా నా వరి ధాన్యం కొనలేదని ఆవేదన చెంది ఏదైనా ఆగాయిత్యం చేసుకుంటే ఆ సంఘటనలకు మీరే బాధ్యత వహించాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు, అంతే కాకుండా చివరి రైతు దాన్యం కొనుగోలు జరిగే దాకా *కాంగ్రెస్ పార్టీ పక్షాన నిరంతర పోరాటం చేస్తానని మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ తెలియజేసారు

Post A Comment: