మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్
కాటారం: మండల కేంద్రం లో ఓపిఎస్ లను వెంటనే జెపిఎస్ లుగా కన్వెర్ట్ చేసి రెగ్యులర్ చేయాలని, ప్రోబేషనరి కాలంను సర్వీస్ కాలంగా పరిగణలోకి తీసుకోవాలని ఎంపీడీఓ ఆఫీస్ ముందు నిరవధిక సమ్మె చేస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు, బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి మద్దతు తెలిపారు.అనంతరం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని , భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడు వీరికి అండగా ఉంటూ మద్దతు ఇస్తుందని, ఓపిఎస్ లను వెంటనే జెపిఎస్ లుగా కన్వెర్ట్ చేసి రెగ్యులర్ చేయాలిని, ప్రోబేషనరి కాలంను సర్వీస్ కాలంగా పరిగణలోకి తీసుకోవాలని,ప్లే స్కేల్ విధానం అమలు చేసి, ప్రభుత్వం ఉద్యోగలకు వర్తిస్తున్న అన్ని సౌకర్యాలు కల్పించాలి,కెసిఆర్ ఇచ్చిన మాట ప్రకారం వీరి డిమాండ్ లను వెంటనే పరిష్కారిలని అన్నారు.ఈకార్యక్రమంలో మండల బిజెపి పార్టీ అధ్యక్షులు బొమ్మన భాస్కర్ రెడ్డి, జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి ఉడుముల విజయ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి పూసల రాజేంద్ర ప్రసాద్, యువ నాయకులు బొడ్డు శివ కుమార్ తదితరులు పాల్గొన్నారు...*అవుట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులు చేస్తున్న సమ్మెకు మద్దతు తెలిపిన బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి*

Post A Comment: