మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
ఎర్రజెండా పేద ప్రజల అండ దండ తుమ్మల రాజారెడ్డి , రెండో డివిజన్ ఇందిరమ్మ కాలనీలో గత 42 రోజులుగా జరుగుతున్న ఇళ్ల స్థలాల పోరాట కేంద్రాన్ని సందర్శించి అనంతరంసీపీఎం పార్టీ జెండాను ఎగురవేశారు, ఈ సందర్భంగా మాట్లాడుతూ, పేద ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇస్తానని తెలంగాణ ప్రభుత్వం , ఆచరణలో అది సాధ్యం కాకపోవడంతో ఇల్లు లేని నిరుపేదలంతా సీపీఎఅండతో ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకోవడం ప్రారంభించారని , ప్రభుత్వం ఇండ్లు లేనిదరఖాస్తు దారు ల అందరికీ , వెంటనే 100 గజాల స్థలం కేటాయించి ప్లాట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు, అలాగే కొందరు వ్యక్తులు దొంగ చాటుగా పేదలు వేసుకున్న గుడిసెలను తొలగించి నిప్పు అంటించే పని చేస్తున్నారని ఈ పద్ధతి మార్చుకోకపోతే తగిన గుణపాఠం చెబుదామని ఏదైనా విషయం ఉంటే సిపిఎం పార్టీ నాయకులతో గానీ ప్రభుత్వ అధికారులతో గానీ మాట్లాడాలి గానీ రెచ్చగొట్టి గొడవలు సృష్టించే పని చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని అన్నారు, ఇళ్ల స్థలాలు వచ్చేంతవరకు ఈ ప్రదేశాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ప్రభుత్వాన్ని కూడా వదిలిపెట్టమని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం ఎన్టీపీసీ రామగుండం ఏరియా కమిటీ కార్యదర్శి ఎం రామాచారి,నాయకులు జి లక్ష్మారెడ్డి, తోట రవీందర్, ఎన్, భాగ్య, స్వప్న, ఏం మహాలక్ష్మి, దూట విజయ, ఆర్. మనోహర్, కైలాస్ బాగ్, వినయ్ స్వప్న, సరిత ఎడ్ల పద్మ పాల్గొన్నారు,

Post A Comment: