మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
సిపిఐ (యమ్- యల్ )న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో పెద్దపల్లి బస్సు స్టాండ్ వద్ద, రాగినేడు గ్రామం లోని బస్సు స్టేజ్ వద్ద ఎర్ర జెండాలు ఎగురావేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అఖిల భారత రైతుకూలీ సంఘం రాష్ట్ర నాయకులు వెల్తురు సదానందం ముఖ్య అధితి గా విచ్చిసే నారు. ఐఎఫ్టియు అరుణో దయ, నాయకులు కాదాసి లింగమూర్తి, తిర్రి బాలకృష్ణ, బాబా, మాలాంగ్, వెంకటేష్, సంతోష్, శేఖర్ గౌడ్, హమాలీలు పాల్గొన్నారు.అఖిలభారత రైతుకూలీ సంఘం రాష్ట్ర నాయకులు వెల్తురు సదానందం మాట్లాడుతూ... సమానపనికి సమానవేతనం, హక్కులకోసం అసువులు బాసిన చికాగో అమరులకు జోహార్లు అర్పించారు. నేడు రాష్ట్రంలో దేశంలో పాసీజం పెరుగుతుంది, మోడీసర్కార్ హిందుత్వం ముసుగులో మైనార్టీ వర్గాలను అణిచివేస్తుంది. ప్రశ్నించిన గొంతుకలపై నిషేధలను విధిస్తుంది. పాసిజానికి వ్యతిరేకంగా సంగటితంగా పోరాటాలకోనసాగించాలి. అమరుల త్యాగాన్ని ఎత్తిపడుతూ మునుముందుకే సాగిపోదాం అని పిలుపునిచ్చారు.
Post A Comment: