మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం పర్యటన దృష్టిలో ఉంచుకొని గోదావరిఖని రాబోతున్న కేటీఆర్ రామగుండం మీద మీకు చిత్తశుద్ధి ఉంటే రామగుండం మీద ప్రేమే ఉంటే మీరు ఐటీ, మున్సిపల్ మినిస్టర్ కదా రామగుండం గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతాన్ని స్మార్ట్ సిటీ గా ప్రకటించండి కదా స్మార్ట్ సిటీగా ఏర్పాటు అవ్వడానికి కేంద్ర ప్రభుత్వానికి రిప్రెజెంటేషన్ ఇవ్వచ్చు కదా ఇది మీ పరిధిలోని అంశమే కదా.......
ఆర్ ఎఫ్ సి ఎల్ లో మీ శాసనసభ్యుడే కదా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని మనిషికి ₹7,00000 రూపాయలు తీసుకొని ఆర్ ఎఫ్ సి ఎల్ నుంచి తప్పిస్తే కాయ కష్టం చేసుకుని, రూపాయి రూపాయి కూడా బెట్టి అప్పు తీసుకొచ్చిన పైసలతో వాళ్లు ఉద్యోగం దొరికి మా బ్రతుకులు గాడిన పడతాయని ఆశపడితే ఇవాళ వాళ్లను ఎక్కడ కాకుండా ఉద్యోగాల నుండి తీసేసి వారి ఆత్మహత్యలకు కారణం అవుతున్నారు కదా దీనికి మీరేం సమాధానం చెబుతారు, నేను డిమాండ్ చేస్తా ఉన్న మీకు చిత్తశుద్ధి ఉంటే ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు 50లక్షలు నష్ట పరిహారం ప్రకటించండి.
ఆర్ ఎఫ్ సి ఎల్ పేరుతో అమాయక ప్రజల దగ్గర ఉద్యోగాల పేరుతో అక్రమంగా వసూలు చేసిన మనిషికి ఒక్కంటికి 700000/-లక్షల రూపాయలు సుమారు 400 మందికి ఒకే దపాలో ఇచ్చి వారి కుటుంబాలను ఆదుకోండి.
అంతే కానీ మాటల గారడితో మసి పూసి మారేడు కాయ చేసి అరచేతిలో స్వర్గం చూపిస్తా అంటే కచ్చితంగా ప్రజలు అన్ని గమనిస్తున్నారు మీకు తగిన బుద్ది చెప్తారు అని ఈ సందర్భంగా *డీసీసీ అధ్యక్షులు, రామగుండం నియోజక వర్గ ఇంచార్జి మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ తెలియజేసారు
Post A Comment: