మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ  భారత్ జోడోయాత్ర స్ఫూర్తిగా ఏఐసీసీ మరియు టీపీసీసీ పిలుపుమేరకు రామగుండం నియోజకవర్గం లోని 14వ డివిజన్ అధ్యక్షులు బుర్ల శ్రీనివాస్  ఆధ్వర్యంలో జరిగిన హార్ట్ చేఆర్ జోడో కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్  పాల్గొన్నారు.

 డివిజన్లోని ప్రతి గడపకు వెళ్లి ప్రజలను ఆత్మీయంగా పలకరిస్తూ వారి సమస్యలను తెలుసుకొని పరిష్కారంలో పోరాటం చేసి కృషి చేయడానికి ముందుంటానని తెలుపుతూ, 

ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హయంలోనే మూతపడిన ఎఫ్ సీ ఐ ను తెరిపించడానికి వాటికి ప్రత్యేక నిధులు కేటాయించడం జరిగింది. కానీ ఇప్పుడున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్ ఎఫ్ సి ఎల్ ఫ్యాక్టరీని మేమే పునః ప్రారంభించామని గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అరాచకమైన పాలనకు చరమగీతం పాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

ఇక రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆర్.ఎఫ్.సి.ఎల్ ఫ్యాక్టరీలో స్థానికులకు ఉద్యోగాలు కల్పించడంలో విఫలం అవ్వడమే కాక ఎంతోమంది నిరుద్యోగుల ఉద్యోగుల నుండి లక్షలాది రూపాయలు వాళ్ళ అనుచరులతో వసూలు చేయించి పర్మినెంట్ ఉద్యోగమని మభ్యపెట్టి చివరకు సంవత్సరం సంవత్సరం ముగిశాక వారందరినీ రోడ్ల పైకి తీసుకొచ్చారు.

నిరుద్యోగుల నుండి లక్షలాది రూపాయలు వసూలు చేసిన వారి అనుచరులు జైలుకు వెళ్లినా కూడా నేటి వరకు వసూలు చేసిన డబ్బులు పూర్తిస్థాయిలో ఇప్పించకుండా వారి కుటుంబాలను ఆగం చేశాడని,

నిరుద్యోగులు ఉద్యోగ భద్రత ఉంటుందని వారి మాయమాటలు నమ్మి వారి ఆస్తులను అసలు అమ్ముకొని చివరకు వారి భార్యల మెడలో ఉన్న పుస్తెలతాడును సైతం అమ్ముకొని ఉద్యోగాల కోసం డబ్బులు పెడితే నేటి వరకు ఇప్పించకపోగా ముంజ హరీష్ అనే యువకుడు డబ్బులు ఇచ్చి మోసపోయానని, నా చావు ద్వారానైనా మిగతా నిరుద్యోగులకు డబ్బులు రావాలని ఆత్మహత్య చేసుకోగా ఇప్పటివరకు ఆ కుటుంబానికి ఇస్తానన్న డబ్బులు నేటికీ ఇవ్వకపోవడం చాలా దారుణమని అదేవిధంగా మిగతా నిరుద్యోగులు కూడా ఆత్మహత్య ప్రయత్నం చేసినా కూడా ఇక్కడున్న ఎమ్మెల్యే కోరు కంటి చందర్ కు కనీసం చలనం కూడా లేకుండా పోయిందని, ఇప్పటికైనా స్థానికులకు ఉద్యోగాలు కల్పించడంతోపాటు నిరుద్యోగుల నుంచి వసూలు చేసిన లక్షలాది రూపాయలు ఇప్పించాలని డిమాండ్ చేశారు. 

రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన వెంటనే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ను,

 ఆరోగ్యశ్రీ ద్వారా ఐదు లక్షల ఉచిత వైద్య సౌకర్యం,

 సొంత జాగా ఉన్న

 నిరుపేదలకు ఇల్లు నిర్మించుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇవ్వడంతో పాటు, 

ఇంట్లో ఇద్దరు వృద్ధులు ఉంటే కనీస పెన్షన్ 5000 రూపాయలు, ఏకకాలంలో రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయలు, అదేవిధంగా అధికారం చేపట్టిన మొదటి ఏడాది రెండు లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తుందని అన్నారు

దాదాపుగా గత 30 సంవత్సరాలుగా రాముడు నియోజకవర్గంలో గెలిచినా ఓడిన ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజల సమస్యల కొరకు పోరాడుతున్న నాకు రానున్న ఎన్నికల్లో ఒకసారి అవకాశం ఇవ్వాలని రాజ్ ఠాకూర్ ప్రజలను కోరారు.

 ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, ఎస్సీ, బీసీ, మైనార్టీ మహిళా విభాగం,ఎన్ ఎస్ యు ఐ,యువజన కాంగ్రెస్ నాయకులతో పాటు అధిక సంఖ్యలో డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: