మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్

మహాదేవపూర్/వరంగల్: నా ఉద్యోగ నిర్వహణలో భాగంగానే భూ తగాదాలను పరిష్కరించి ప్రజలకు న్యాయం చేస్తున్నాను. భూ బాధితులు ఎవరు తన చిత్రాలతో కూడిన ప్లెక్సీలను ఏర్పాటు చేసి వాటికి పాలభిషేకాలు చేయవద్దని వరంగల్

పోలీస్ కమిషనర్ భూ బాధితులకు సూచించారు.


వరంగల్ పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పలు భూకబ్జాలకు సంబంధించిన కేసులను పరిష్కరించి బాధితులకు తగు రీతిలో న్యాయం చేస్తుండంతో పాటు, భూకబ్జారాయుళ్ళ భరతం పడుతూ వరంగల్ పోలీస్ కమిషనర్ ద్వారా న్యాయం పొందిన బాధితులు పోలీస్ కమిషనర్ రంగనాథ్ పై తమ అభిమానం చాటడంతో పాటు కృతజ్ఞత భావంతో బాధితులు, పోలీస్ కమిషనర్ చిత్రాలు కూడిన ప్లెక్సీలను కూడళ్ళల్లో ఏర్పాటు చేసి పాలభిషేకాలు జరపడంపై వరంగల్ పోలీస్ కమిషనర్ స్పందిస్తూ ఆదివారం పత్రికా ప్రకటన విడుదల చేసారు.


రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన మేరకు, పేదవారికి తగురీతిలో న్యాయం చేయడంతో పాటు, వారికి వెన్నంటి వుంటూ నా ఉద్యోగ బాధ్యతను నిర్వర్తిస్తూ, పేదలకు న్యాయం చేసే దిశగా నాకర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాను. ఇదే రీతిలో వరంగల్ కమిషనరేట్ కు చెందిన ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది సైతం తమకు అప్పగించిన బాధ్యతలను బాధ్యతయుతంగా నిర్వహిస్తూ, నిరుపేదలకు న్యాయం అందిస్తున్నారు. తద్వారా కమిషనరేట్ పరిధిలో పలు భూకబ్జా కేసులను పరిష్కరించి, బాధితులకు న్యాయం చేస్తుండంతో తిరిగి తమ భూములను పొందిన బాధితులు తనకు కృతజ్ఞతలు తెలుపుకునే రీతిలో తన ప్లెక్సీలకు పాలభిషేకాలు చేయడం సరికాదని, నిరంతరం శాంతి భద్రతలను పరివేక్షించడంతో పాటు, నిరుపేద వర్గాల ప్రజలకు న్యాయం అందించాల్సిన బాధ్యత తనపై వుందని, ఇందులో భాగంగానే భూకబ్జా కేసులకు సంబంధించి వచ్చిన ఫిర్యాదులపై క్షేత్ర స్థాయిలో లోతుగా విచారణ జరిపి, రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నతాధికారులు, ఇతర ప్రభుత్వ విభాగాలతో పాటు సహచర పోలీస్ అధికారులు, సిబ్బంది సహకారంతో చట్ట పరిధిలో బాధితులకు న్యాయం అందించడం జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం,పోలీసులు నిరంతరం బాధితుల పక్షాన నిలుస్తారని, బాధితులకు న్యాయం చేయడం పోలీసుల కర్తవ్యంలో ఒక భాగమేనని, కావున పోలీసులపై అభిమానాన్ని చాటేందుకుగాను పాలభిషేకాలు చేయాల్సి అవసరం లేదని పోలీస్ కమిషనర్ ప్రజలకు సూచించారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: