మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
NTPC లో IFTU నూతన కార్యాలయాన్ని IFTU తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సూర్యం, భవన నిర్మాణ కార్మిక సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్ హాన్మేష్ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో IFTU విప్లవ కార్మిక సంఘంగా అనేక సమరశీల పోరాటాలు నిర్వహించింది. సంఘటిత సంఘటిత రంగ కార్మిక హక్కుల కోసం వారి సౌకర్యాల కోసం శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా, కార్మిక చట్టాల అమలు కోసం రాజీ లేని పోరు కొనసాగిస్తున్నది. దేశంలో మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో కెసిఆర్ ప్రభుత్వం వచ్చి కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ పోరాడి సాధించుకున్న హక్కులను సైతం హరించి వేసే విధంగా పాలన కొనసాగిస్తున్నారు. ఈ స్థితిలో బలమైన కార్మిక ఉద్యమాలు నిర్మించాల్సిన అవసరం ఉన్నది. కార్మిక క్షేత్రానికి నిలువుటద్దంగా ఉన్న రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో విప్లవ కార్మిక సంఘం గా బలమైన కార్మిక పోరాటాలు నిర్మించి ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలని ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. *IFTU రాష్ట్ర నాయకుల గుజ్జుల సత్యనారాయణ రెడ్డి అధ్యక్షతన జరిగిన *ఈ సభలో CPI ML ప్రజాపంధా రాష్ట్ర నాయకులు నంది రామయ్య, జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్, IFTU నాయకులు తోకల రమేష్, జే. రాంప్రసాద్, గుమ్మడి వెంకన్న ఆడెపు శంకర్, మార్త రాములు,కలువల రాయమల్లు, ఏ.మల్లయ్య, ఇనుగాల రాజేశ్వర్,గొల్లపల్లి చంద్రయ్య, మార్త రాధ కోడిపుంజుల లక్ష్మి కొయ్యడ శంకర్,పెండ్యాల ఓదెలు, తూళ్ళ శంకర్ ,స్వరూప,స్పందన నాని,సంపత్ రామన్న లతో పాటు అధిక సంఖ్యలో ఐ ఎఫ్ టు యు కార్యకర్తలు పాల్గొన్నారు

Post A Comment: