ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం అమలు గురించి మంగళవారం జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ అధ్యక్షతన గొర్రెల కొనుగోలు చేయడానికి ఏర్పాటు చేసిన జిల్లా కమిటీ లోని జిల్లా అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
జిల్లా పశు వైద్య మరియు పశుసంవర్ధక అధికారి డాక్టర్ శ్రీనివాస్ గొర్రెల పంపిణీ కార్యక్రమం రెండో విడత గురించి గొర్రెల కొనుగోలు చేయడానికి ఏర్పాటు చేసిన జిల్లా ఆఫీసర్లకు వివరించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ లబ్ధిదారులకు సంబంధించిన వివరాలను సేకరించి ఈ- లాబ్ లో నమోదు చేయాలని, మండలంలో లబ్ధిదారుల వివరాలను పరిశీలించడానికి మండల పశు వైద్య అధికారి, ఎంపిడిఓ, నయబ్ తహసిల్దార్ లతో మండల కమిటీలను ఏర్పాటు చేసి వారంలోపు లబ్ధిదారులకు అవగాహన సదస్సులు, లబ్ధిదారుల వివరాలను నమోదు చేయవలసిందిగా జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. లబ్ధిదారులలో ఎవరైనా మరణిస్తే వారి వివరాలు సేకరించాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీవో రాము, వసుచంద్ర, పిడి డి ఆర్ డి ఏ శ్రీనివాస్ కుమార్, జిల్లా పంచాయతీ అధికారి జగదీశ్వర్, జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి మల్లయ్య, జిల్లా బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్ రామ్ రెడ్డి, అడిషనల్ పిడి డి ఆర్ డి ఓ రవి, ఏడి అగ్రికల్చర్ దామోదర్ రెడ్డి, జిఎండిఐసి హరిప్రసాద్, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.

Post A Comment: