ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ; నవభారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా. బిఆర్. అంబేద్కర్ 125 అడుగుల విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ప్రజలు పాల్గొనేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు.
మంగళవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్ నుండి హైదరాబాదులో 125 అడుగుల బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి జన సమీకరణ ఏర్పాట్లపై నోడల్ అధికారులు తో కలెక్టర్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డా. బిఆర్. అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14 రోజున హైదరాబాదులో నవభారత నిర్మాత భారతరత్న అంబేద్కర్ విగ్రహవిష్కరణ కార్యక్రమంలో నియోజవర్గం నుండి 300 మంది పాల్గొనేలా మండలాల వారీగా జన సమీకరణ చర్యలు చేపట్టాలని అన్నారు. నియోజకవర్గానికి ఆరు బస్సులను పాటు చేసి ప్రతి బస్సు లో ఒక లైజన్ అధికారికి కార్యక్రమంలో పాల్గొని తిరిగి మండల కేంద్రాలకు చేరేవరకు బాధ్యతలు అప్పగించాలన్నారు. ఎంపీడీవో, తహసిల్దార్ స్థాయి అధికారులను లైజన్ అధికారులుగా నియమించాలని అన్నారు. కార్యక్రమానికి వచ్చే వారికి బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ భోజనం, వాటర్ బాటిల్స్ ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమం కోసం తీసుకెళ్లే వాహనాలకు ఫ్లెక్సీలు అమర్చాలని, ఎస్కార్ట్ సిబ్బంది ఉండాలన్నారు.
కార్యక్రమం నకు సకాలంలో అందరు చేరే విధంగా అధికారులు సమన్వయము తో విజవంతం చేయాలనీ అన్నారు.
ఈ సమావేశం లో అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, డిఆర్ఓ వాసుచంద్ర, పరకాల ఆర్డీఓ రాము, జెడ్పీ సీఈవో వెంకటేశ్వర్ రావు, డిఆర్డిఏ పీడి శ్రీనివాస్, డిపిఓ జగదీశ్వర్, ఏసిపి కిరణ్ కుమార్, బీసీ సంక్షేమశాఖ అధికారి రాం రెడ్డి, ఎస్.సి సంక్షేమ శాఖ అధికారి నిర్మల, ఎస్.సి కార్పొరేషన్ ఈడి మాధవి లత, ఆర్టీసీ ఆర్ ఎం శ్రీలత , తహశీల్దార్ రియాజ్, రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: