ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
బలగం సినిమాతో తనదైన శైలిలో ప్రజలను మెప్పించిన కళాకారుడు బలగం మొగిలయ్య అనారోగ్యంతో బాధపడుతూ సంరక్ష హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సందర్భంగా నేడు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ వారిని పరామర్శించారు. మొగిలయ్య ఆరోగ్య పరిస్థితి గురించి ఇప్పటికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు,జిల్లా మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు తాను ఎప్పటికప్పుడు మొగిలయ్య ఆరోగ్య పరిస్థితి సమీక్షిస్తున్నామని నేడు మొగిలయ్య ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని మెరుగైన వైద్యం కోసం నిమ్స్ హాస్పిటల్ కు ఎమ్మెల్యే నరేందర్ దగ్గరుండి అంబులెన్స్ లో పంపించి ఆర్థికసాయంతో పాటు రవాణా సౌకర్యం ఏర్పాటు చేశారు.
మొగిలయ్య ఆరోగ్యం కుడుటపడి ఆయురారోగ్యాలతో క్షేమంగా తిరిగి రావాలని ఎమ్మెల్యే కోరుకున్నారు.

Post A Comment: