మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
హైదరాబాద్ లోని చిక్కడపల్లి శ్రీ త్యాగరాయ గాన సభ లో తెలుగు వెలుగు సాహితీ వేదిక స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో తెలుగు వెలుగు ఉగాది మహానంది జాతీయ పురస్కారాల ప్రధానోత్సవం 02 ఏప్రిల్ 2023 ఆదివారం రోజున జరిగినది.పురస్కారాల మహోత్సవ సన్మాన పత్రం పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం ఇద్దులపూర్ గ్రామంకు చెందిన పి పి ఎల్ (ప్రోగ్రెస్సివ్ పేరెంట్స్ లీగ్) ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జి దార మొండయ్య(మధు)కు సామాజిక సేవా రంగంలో జాతీయ మహానంది అవార్డు గౌరవ పురస్కారం డాక్టర్ దైవజ్ఞ శర్మ సరస్వతి మాత ఉపాసకులు,డాక్టర్ వంగాల శాంతి కృష్ణ ఆచార్య గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గ్రహీత చేతుల మీదుగా సత్కరించడమైనది.అనంతరం వారు మాట్లాడుతూ విశిష్టమైన కృషి చేసినందుకు హృదయ పూర్వకంగా అభినందిస్తూ,కృషి నిరంతరం కొనసాగాలని ఇంకా ఎన్నో అద్భుతాలను ఆకాంక్షిస్తూ విజయాలను సాధించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో తెలుగు వెలుగు సాహితీ వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు మరియు కార్యక్రమ నిర్వాహకులు బ్రహ్మశ్రీ పోలోజు రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: