మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్

తెలంగాణాలో ఈ రోజు నుంచి టెన్త్ ఎగ్జామ్స్ ప్రారంభమైన విషయం తెలిసిందే.వికారాబాద్ జిల్లా తాండూరులో పరీక్ష ప్రారంభమైన కొద్ది సేపటికే పరీక్షా పేపర్ వాట్సాప్ లో చక్కర్లు కొట్టింది.ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఉన్నతాధికారులు మాత్రం అలా ఏం జరగలేదని కొట్టి పారేస్తున్నారు.పేపర్లను ఇన్విజిలేటర్లే లీక్ చేశారా?లేదా అధికారుల స్థయిలో లీక్ జరిగిందా? అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.ఉన్నత స్థాయి విచారణ జరిపించి ఈ విషయంలో వాస్తవాలను వెలికితీయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.......

వికారాబాద్ జిల్లా తాండూరులో ఈ రోజు ఉదయం 9:37 గంటలకే టెన్త్ ప్రశ్నా పత్రం కొన్ని వాట్సాప్ గ్రూప్ లలో వచ్చింది.దీంతో స్థానికంగా కొందరు స్పందించి ఉన్నతాధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లినట్లు సమాచారం.కానీ వారు మాత్రం పేపర్ మనది కాదని వారు బుకాయించినట్లు తెలుస్తోంది.

అయితే, పరీక్ష ముగిసిన తర్వాత బయటకు వచ్చిన విద్యార్థుల వద్ద ఉన్న ప్రశ్నా పత్రాన్ని పరిశీలించగా వాట్సాప్ లో వచ్చిన దానిని పోలినట్లు ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం.ఈ విషయంపై జిల్లా ఉన్నతాధికారులు సీరియస్ అవడంతో డీఈవో హుటాహుటిన కలెక్టరేట్ కు వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. ఇంటెలిజెన్స్ అధికారులు కూడా రంగంలోకి దిగి వివరాలను సేకరిస్తున్నారు.

ఓ గవర్నమెంట్ తెలుగు టీచర్ పేపర్ ను వాట్సాప్ ద్వారా లీక్ చేసినట్లు గుర్తించిన అధికారులు. అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే రాష్ట్రంలో తెలంగాణ స్టేట్ సర్వీస్ పబ్లిక్ సర్వీస్ నుంచి పేపర్లు లీకైన అంశంపై తీవ్ర దుమారం రేగుతోంది. ఈ సమయంలో టెన్త్ పేపర్లు కూడా బయటకు వచ్చాయన్న వార్త అందరినీ షాక్ గురి చేసింది.ఈ నేపథ్యంలో ఈ అంశంపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్న అంశం ఉత్కంఠగా మారింది..

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: