ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
బాలసముద్రం లోని సాయి నగర్ లో అధికారులతో కలిసి పర్యటించి స్థానిక ప్రజల సమస్యలు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అడిగి తెలుసుకున్నారు. తదనంతరం చీఫ్ విప్ మాట్లాడుతూ యేళ్ళా తరబడి ఇక్కడ నివాసం ఉంటున్న నిరుపేద ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుపేదల పక్షపాతి అని తెలుపుతూ ఈనెల 30 తారీకు వరకు జీవో నెంబర్ 58 ద్వారా ఇళ్ల పట్టాలకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారని తెలిపారు. అర్హులైన నిరుపేదలందరూ దరఖాస్తు చేసుకోవాలని వారికి ఇళ్ల పట్టాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటారని తెలుపుతూ గత పాలకులు ఇక్కడి ప్రజలను తరిమేయాలని చూశారని తెలంగాణ రాష్ట్రం సాదించుకున్నాక వారికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని తెలుపుతూ పట్టాల కొరకు దళారులు ఎవరికీ డబ్బులు ఇవ్వాకుడాదని సూచించారు.
కార్యక్రమంలో ఆర్డీవో వాసుచంద్ర స్థానిక కాలనీ ప్రజలు పాల్గొన్నారు.

Post A Comment: