మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో, నేరుగా గోదావరి మురుగునీరు కార్మిక కుటుంబాలకు సప్లై అవుతున్న గంగానగర్ ఫిల్టర్ బెడ్లను సందర్శించిన సిఐటియు బృందం, రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ, సింగరేణి యాజమాన్యం కు కార్మికులు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యాల పట్ల ఎలాంటి శ్రద్ధ లేదని, ఎలాంటి ఫిల్రేషన్ లేకుండా, గోదావరి మురుగు నీరును నేరుగా కుటుంబాలకు అందించడంలోనే అర్థమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు, గత రెండు సంవత్సరాల నుంచి సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో మంచినీటి సమస్యపై కార్మికులు ఆందోళన చెందుతుంటే అనారోగ్యాల ఫాలో అవుతుంటే, అనేకసార్లు యజమాన్యం దృష్టికి తీసుకుపోయినప్పటికీ పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తూ, కంటి తూడ్పు చర్యలతో కోట్ల రూపాయలు ఖర్చు చేసి, ఆర్వో ప్లాంట్ లు పెట్టినమని, ఫిల్టర్ బెడ్లు తయారు చేసిన మని చెప్తున్నారు అని, కార్మికుల కుటుంబాల ఆరోగ్యాలతో ఆటలాడుతున్నారని, గత వారం రోజుల నుంచి వస్తున్న ఈ మురుగునీరు తాగిన కుటుంబ సభ్యులు డయేరియా వ్యాధితో హాస్పటల్ ఫాలు అవుతున్నారని, ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం తక్షణమే ఫిల్టర్ బెడ్ లను పునరుద్ధరించి ఫిల్టర్ రేషన్ వాటర్ అందించాలని కార్మిక కుటుంబాల ఆరోగ్యాలు కాపాడాలని డిమాండ్ చేశారు, ఈ కార్యక్రమంలో అర్జి1, కార్యదర్శి మెండే శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి జేల్లా గజేంద్ర, సానం రవి, ఉపాధ్యక్షులు ఆసరి మహేష్, ఆరెపల్లి రాజమౌళి, సిహెచ్ వేణుగోపాల్ రెడ్డి, దాసరి సురేష్, నంది నారాయణ, అన్నం శ్రీనివాస్, మామిడి మల్లయ్య, రామ్ నరసయ్య, ఆకుల రవి, దశరథ రెడ్డి, కుమార్, తదితరులు పాల్గొన్నారు,


Post A Comment: