ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఆర్ముడ్ రిజర్వ్ అడిషనల్ ఎస్పీగా వేముల శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. సోమవారం ఎస్పీ జే సురేందర్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందించారు. 1992 సంవత్సరంలో ఆర్ఎస్ఐగా ఎంపికైన శ్రీనివాస్ పోలీసు శాఖలో ఉత్తమ ప్రతిభ, విధినిర్వహణలో సమర్థవతంగా పనిచేసి, 2006లో రిజర్వ్ ఇన్స్పెక్టర్ గా పదోన్నతి పొందారు. వరంగల్ ఆదిలాబాద్, ఖమ్మం, జగిత్యాల జిల్లాలో పనిచేశారు. నిజామాబాద్ జిల్లాలో ఏఆర్ డిఎస్పీగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్, పదోన్నతి పొంది భూపాలపల్లి జిల్లా అడిషనల్ ఎస్పీగా వచ్చారు. ఏ.అర్ అడిషనల్ ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్ ను జిల్లా పరిధిలోని రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, ఆర్ ఎస్సై లు, పోలీసు సిబ్బంది, కలిసి శుభాకాంక్షలు తెలిపారు

Post A Comment: