మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా *ప్రజా గోస- బిజెపి భరోసా కార్యక్రమం ద్వారా నియోజకవర్గం లోని మండలాలు,శక్తి కేంద్రాలు మరియు బూతు స్థాయిలో ప్రజల్లో మంచి స్పందన ఆదరణ లభించింది.

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆదేశాల మేరకు ప్రజా గోస-బిజెపి భరోసా కార్యక్రమంలో భాగంగా మండలంలోని శక్తి కేంద్రాల్లో గత పది రోజులుగా నిర్వహించినటువంటి బూతు స్థాయి కార్నర్ మీటింగ్స్ విజయవంతంగా ముగిసిన సందర్భంగా  గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో రామగుండం బిజెపి పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాగోస-బిజెపి భరోసా కార్నర్ మీటింగ్స్ ముగింపు విజయోత్సవ సభలో ముఖ్య అతిథిగా *బిజెపి రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఆర్టీసీ చైర్మన్  సోమారపు సత్యనారాయణ రామగుండం అసెంబ్లీ ఇన్చార్జి ప్రబారి ఆరుముళ్ళ పోచం పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ

కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో దళితులకె ముఖ్యమంత్రి పదవి అని చెప్పి ఇప్పటివరకు కూడా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న కేసిఆర్ మాయమాటలు చెప్పి తెలంగాణ ప్రజలను మోసం చేస్తూనే ఉన్నాడని అన్నారు.

రైతులకు రైతు బంధు ఇస్తున్న అని గొప్పలు చెప్పే కేసిఆర్ రైతులకు సమస్యలేమో కొండంత ఉంటే రైతులకు ఇచ్చేది మాత్రం గోరంత అన్నట్లు రైతుల పరిస్థితి ఉందన్నారు.ఓవైపు నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశంలో ఆధునిక టెక్నాలజీతో మనం ముందుకు వెళుతుంటే,బంగారు తెలంగాణలో మాత్రం ఎక్కడ చూసినా భూ కబ్జాలు, కుంభకోణాలు, ఇసుక మాఫియా, బూడిద మాఫియా, యదేచ్చగా కోనసాగుతున్నాయన్నారు.

జాతీయ రహదారులు, ఫోర్ లైన్ వే లు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే జరిగాయని అన్నారు. అగ్రదేశాల సరసన ఈరోజు మనం ఉన్నామంటే అది కేవలం నరేంద్ర మోడీ గొప్పతనం మాత్రమే అని నోట్ల రద్దు, జిఎస్టి, త్రిబుల్ తలాక్ వంటి చారిత్రాత్మక నిర్ణయాలు కేవలం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఘనత అని అన్నారు. అంతేకాకుండా ప్రతిరోజు 18 గంటలు దేశం కోసం పనిచేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం నరేంద్ర మోడీ మాత్రమే అన్నారు. ఎందరో ప్రాణ త్యాగాల వలన మనం ఈరోజు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకుంటే ఈరోజు ఎక్కడ చూసిన అవినీతి, సింగరేణి హామీలు అమలు లేదు, ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ భృతి లేదు, ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి బంగారు తెలంగాణలో  కెసిఆర్ కుటుంబం మాత్రం బంగారు కుటుంబం అయిందని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్నో సంక్షేమ పథకాలను రాష్ట్రంలో వాటిని ప్రజలకి చేరకుండా కేసీఆర్ అడ్డుపడుతున్నారని అన్నారు. ఇప్పటికైనా ప్రజలు ఆలోచించి కేంద్రంతో పాటు రాష్ట్రంలో కూడా బిజెపి ప్రభుత్వం ఉన్నట్లయితే మన రాష్ట్రాన్ని మనం ఎంతో అభివృద్ధి చేసుకోవచ్చని అన్నారు.

ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బల్మూరి అనిత , బిజెపి రాష్ట్ర మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలు  సోమారపు లావణ్య ,బిజెపి రాష్ట్ర ఎస్సీ సెల్ కోశాధికారి కాసిపేట శివాజీ,బిజెపి రాష్ట్ర నాయకులు సోమారపు అరుణ్ కుమార్,కార్పొరేషన్ అధ్యక్షులు లక్ష్మణ్,బీజేవైఎం జిల్లా అధ్యక్షులు బద్రి దేవేందర్, ఓబిసి జిల్లా అధ్యక్షులు పిడుగు కృష్ణ, కార్పొరేటర్లు దుబ్బాసి లలిత, కిషన్ రెడ్డి, మండలాల అధ్యక్షులు మారం వెంకన్న, మాతంగి రేణుక, పత్తి సంజీవ్, నారాయణరెడ్డి, డేవిడ్ రాజ్, దాసరి శ్రీనివాస్, మహిళా నాయకులు చిలుక భారతి, గాండ్ల స్వరూప, మరియు శక్తి కేంద్రం, బూతు అధ్యక్షులు మహిళా మోర్చా నాయకులు, బీజేవైఎం నాయకులు, ఎస్సీ సెల్, బిసి సెల్ మరియు బిజెపి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: