మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
(రామగుండం అనతి కాలంలోనే అగ్ని ధార దినపత్రిక ప్రజలకు చేరువై గొప్ప ప్రజాదరణ పొందిందని బిఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. గోదావరిఖని తన క్యాంపు కార్యాలయంలో అగ్నిధార పేపర్ యాజమాన్యంతో కలిసి అగ్నిధార దినపత్రిక 2023 నూతన సంవత్సర క్యాలెండర్ ను ఎమ్మెల్యే చందర్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అగ్నిధార పత్రిక వైవిద్య భరితమైన కథనాలతో ప్రజల, పాఠకుల మన్ననలు పొందుతూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుందని తెలిపారు. ఫోర్త్ ఎస్టేట్ సమాజానికి అద్దం అని నిస్పక్షపాతంగా వార్తలను ప్రచారం చేయడం ద్వారా సమాజాన్ని లోతుగా ప్రభావితం చేయగలదని తెలిపారు.వాస్తవికత కథనాలను అందిస్తూ ప్రజల్లో గొప్ప ఆదరణ పొందిందన్నారు. నేడు ఈ పత్రికా రంగంలో నూతన వరవడితో అనతికాలంలోనే విశ్వసనీయమైన సమాచారాన్ని అందించే పత్రికల్లో అగ్ని ధార పత్రిక ఒకటని ఎమ్మెల్యే చందర్ పేర్కొన్నారు. అగ్నిధార పత్రిక మరింతగా ప్రజల మన్ననలు పొందాలని ఆకాంక్షించారు. పత్రికా విలువలను మరింత ఇనుమడింపచేసేలా అగ్నిధార పత్రిక కొనసాగడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో. డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు, అగ్నిధార పత్రిక సీఈవో చేకొండ రవికుమార్ యాదవ్, నగేష్ నేత , రావుల చంద్రమౌళి, సతీష్,
ఆవుల రాజేష్, కొండ్ర అంజయ్య , శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Post A Comment: