మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
CPI ML ప్రజాపంధా ఆవిర్భావ సభ లో జిల్లా కన్వీనర్ గుజ్జుల సత్యనారాయణ రెడ్డి,
జిల్లా నాయకులు జూపాక శ్రీనివాస్, తోకల రమేష్ పిలుపు. CPI ML ప్రజాపంధా ఆధ్వర్యంలో పెద్దంపేట లో CPI ML ప్రజాపంధా జండాను పార్టీ జిల్లా కన్వీనర్ వృద్ధుల సత్యనారాయణ రెడ్డి ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జెండావిష్కరణ చేసిన జిల్లా నాయకులు జూపాక శ్రీనివాస్, తోకల రమేష్ మాట్లాడుతూ సమాజంలో వచ్చిన మార్పులను శాస్త్రీయంగా పరిశీలించి కమ్యూనిస్టు వందేళ్ల ఉద్యమాన్ని సమీక్ష చేసుకోవలసిన అవసరం ఏర్పడింది. దోపిడీ రూపాలు సమాజ జీవితంలోని అన్ని రూపాలలో చుట్టేస్తున్న స్థితిని మనం అర్థం చేసుకోవాలి. ఫ్యూడల్ వ్యవస్థ శిథిలావస్థకు చేరి పెట్టుబడిదారీ వ్యవస్థ బలపడుతున్న తీరును గమనించాలి. భౌతిక పరిస్థితులు స్వీయాత్మక శక్తుల పరిస్థితి రీత్యా దేశంలో సార్వత్రిక సమ్మెలు, పెద్ద ప్రజా ఉద్యమాలు, వర్గ పోరాటాలు నిర్వహించడం ఆ వెల్లువలతోనే అంతిమంగా సాయుధ పోరాటం ద్వారా వ్యవస్థను మార్చే విధంగా నిజమైన ప్రజాపంధా మార్గంలో పయనించాలని పిలుపునిచ్చారు. వందేళ్ళ కమ్యూనిస్టు ఉద్యమ విలువైన త్యాగపూరిత పోరాట వారసత్వాన్ని స్వీకరించి విప్లవోద్యమ నిర్మాణానికి అందరం కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఇంకా ఈ కార్యక్రమాలలో CPI ML ప్రజాపంధా జిల్లా నాయకులు పెండ్యాల రమేష్, గుమ్మడి వెంకన్న, ఆడెపు శంకర్ , గొల్లపల్లి చంద్రన్న మార్త రామన్న తుల శంకర్ ఎల్లన్న తట్టతేజేశ్వర్ శ్రీను సంతోష్ నామాల పాపన్న రాజేష్ మల్లేష్ భూషవేణి కృష్ణ, బి. మార్త రాదా కోడిపుంజుల లక్ష్మి మైపాల్ రాములు, నస్పూరి లక్ష్మి, ఆలకుంట ఎల్లయ్య, ఇనుగాల రాజేశ్వర్, ఎమ్ వాసుదేవ రెడ్డి, మెతుకు వెంకటేశం, ఏ. సారయ్య, పి.రాజేందర్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: