ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
జిల్లాలో మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో మంత్రుల పర్యటన నేపథ్యంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి జె. సురేందర్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ఐటీ , పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో మంత్రులు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని, ప్రతి కార్యక్రమం వద్ద కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని, ఆయా ప్రాంతాల్లో నియమించిన పోలీసు అధికారులు, సిబ్బంది, నిర్దేశిత విధులు, పూర్తిస్థాయిలో పకడ్బందీగా నిర్వహించాలని, ఎస్పి ఆదేశించారు. బుధవారం మంత్రులు పర్యటించే ఘనపురం, భూపాలపల్లిలోని ప్రతి ప్రాంతాన్ని ఎస్పి సురేందర్ రెడ్డి పరిశీలించి, పోలీస్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఎస్పీ ఆదేశించారు. కాన్వాయ్, హెలిపాడ్ బందోబస్తు, ట్రాఫిక్, పార్కింగ్, బహిరంగ సభ బందోబస్తు ఏర్పాట్లపై ఎస్పి సురేందర్ రెడ్డి పోలీసు అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. అంతకు ముందు మంజుర్ నగర్ లోని ఇల్లందు క్లబ్ లో మంత్రుల బందోబస్తుకు సంబంధించిన సమావేశం నిర్వహించి, ఇతర జిల్లాల నుంచి వచ్చిన పోలీసు అధికారులు, సిబ్బందికి తగు సూచనలు ఇచ్చారు. ప్రజల పార్కింగ్ కొరకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, పోలీసులు అప్రమత్తంగా విధులు నిర్వహించాలని, బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎలాంటి ఘటనలు జరగకుండా విధులు నిర్వర్తించాలని ఎస్పి సురేందర్ రెడ్డి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎస్పి వెంట అదనపు ఎస్పి వి.శ్రీనివాసులు, భూపాలపల్లి, కాటారo డీఎస్పీలు రాములు, రామ్ మోహన్ రెడ్డి, భూపాలపల్లి సీఐ రాజిరెడ్డి, రిజర్వు, సీఐ రంజిత్ రావు, రిజర్వు ఇన్స్పెక్టర్లు సంతోష్, సతీష్ పాల్గొన్నారు.
Post A Comment: