ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
కుడా ఆధ్వర్యంలో వరంగల్ మహానగరంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు.
బుధవారం నగరంలో కుడా విసి, కమిషనర్ ప్రావీణ్య తో కలిసి కుడా ఆధ్వర్యంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను క్షేత్ర స్థాయిలో ఆమె పరిశీలించారు.
ఈ సందర్భంగా కాకతీయ మ్యూజికల్ గార్డెన్ లో కొనసాగుతున్న అభివృద్ధి పనులైన గ్రీనరీ, లైటింగ్, ఆట పరికరాలను పరిశీలించి అసంపూర్తిగా ఉన్న పనులను త్వరితగతిన చేపట్టి ఏప్రిల్ చివరి నాటికి పూర్తి చేయాలన్నారు.
భద్రకాళి మాడవీధుల స్థలాలను ఈ సందర్భంగా పరిశీలించి టెండర్ ప్రక్రియ పూర్తయిన వెంటనే పనులు ప్రారంభించుటకు చర్యలు తీసుకోవాలన్నారు.
అనంతరం బస్ స్టేషన్ ప్రాంతాన్ని పరిశీలించి నవీకరణ నిమిత్తం ఆర్టీసీ అధికారులతో కలిసి వెంటనే డిపిఆర్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో కుడా ప్రాజెక్ట్ ఆఫీసర్ అజిత్ రెడ్డి, ఈఈ భీంరావు, భద్రకాళి ప్రధాన అర్చకులు శేషు
కుడా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: