మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
పెద్దపల్లి జిల్లా అంతర్గం మండల కేంద్రంలోని ప్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో అంతర్గా మండల కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తిరుపతి గౌడ్ మాట్లాడుతూ మండలానికి సంబంధించిన పలు గ్రామాల్లోని భూముల విషయంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం పట్టాలిప్పించే అంశాన్ని శాసనసభలో మాట్లాడాలని మా కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ మరియు మాజీ ఎంపీపీ ఉరిమెట్ల రాజలింగములు ప్రశ్నిస్తే పనిచేయాల్సింది పోయి ఎదురు దాడికి దిగడం వ్యక్తిగతంగా విమర్శించడం ఒక రకంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం సబబు కాదని స్థానిక శాసనసభ్యులు కోరు కంటి చందర్ కు తెలియజేస్తున్నాం ఇప్పటికైనా మేము అడిగిన ప్రజా సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేయాలని మీ అనుచరులతో కౌంటర్ ప్రెస్ మీట్ లో సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేయించడం సబబు కాదని హెచ్చరించారు*పెద్దంపేట గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మెరుగు కుమార్ గౌడ్ మాట్లాడుతూ పెద్దంపేట గ్రామ కూర్సు కమ్మి భూములకు పట్టాలిస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకొని శాసనసభలో మాట్లాడాలని స్థానిక శాసనసభ్యులు కోరికంటి చందర్ ను పత్రికా ముఖంగా కోరితే మా నాయకులు పెండ్యాల మహేష్ పై మరియు మాజీ ఎంపీపీ ఉరిమెట్ల రాజలింగములపై అదేవిధంగా మా పార్టీ పెద్ద నాయకుల పైన కాంగ్రెస్ పార్టీ పైన విమర్శకు దిగడం సరికాదని ఇప్పటికైనా పట్టాలు ఇప్పించి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి తప్ప ఎదురు దాడి చేసి కౌంటర్ ప్రెస్ మీట్లు పెడుతు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం ద్వారా అభివృద్ధి జరగదని ఇప్పటికైనా సమస్యల పరిష్కారం దిశగా పని చేయాలని స్థానిక శాసనసభ్యులు కోరుకంటి చందర్ ను కోరుతున్నామని అన్నారు*పెద్దంపేట గ్రామ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఊరేటి మహేష్ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే విధంగా పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ పై నిన్న కొంతమంది టిఆర్ఎస్ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని పెండ్యాల మహేష్ కు కారు ఎలా వచ్చిందో అని ప్రశ్నించారు కదా కార్ ఎలా వచ్చిందో లెక్కలతో సహా నిరూపించడానికి మేము సిద్ధమని మీ శాసనసభ్యులకు గెలవకముందు ఎన్ని ఆస్తులు ఉన్నాయో గెలిచిన తర్వాత ఎన్ని ఆస్తులు ఉన్నాయో లెక్కలతో నిరూపించడానికి మీరు సిద్ధమని బహిరంగ సవాల్ విసిరారు అదేవిధంగా పెద్దంపేట గ్రామంలో ఏదో ల్యాండ్ కబ్జా చేశారని ఆరోపించారు కదా ఒకవేళ కబ్జా చేసినట్టుగా మీరు నిరూపిస్తే కబ్జా చేసిన స్థలాన్ని పెద్దంపేట గ్రామపంచాయతీ విరాళంగా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని లేదంటే మీరు చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు*ఈ విలేకరుల సమావేశంలో అంతర్గాం మండల కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మడ్డి తిరుపతి గౌడ్ పెద్దంపేట గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మెరుగు కుమార్ గౌడ్ పెద్దంపేట గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నాడేం అంజయ్య వేముల రమేష్ పల్లె రవీందర్ బైరి సురేష్ గౌడ్ యూత్ కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు ఊరేటి మహేష్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తమ్మనవేని కుమార్ యాదవ్ శంకర్ నాయక్ సందనవేణీ శేఖర్ బీరెల్లి ప్రశాంత్ లైసెట్టి మహేష్ తదితరులు పాల్గొన్నారు

Post A Comment: