ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 


హన్మకొండ ;

బీసీ సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. బీసి సంక్షేమంపై నాకు మాట్లాడే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. బీసీ నాయకులం అని చెప్పుకునే కొందరు ప్రతిపక్షనేతలు బీసీ సంక్షేమంపై చర్చ సందర్బంగా సభలో లేకపోవటం బీసీల పట్ల వారికున్న చిత్తశుద్ది తెలియజేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్  బీసీ సంక్షేమం కోసం అనేక పథకాలు రూపకల్పన చేసారు.యాదవ, కురుమలకు గొర్రెల యూనిట్లను సబ్సిడీ ద్వారా అందజేసి వాళ్ళ బ్రతుకుల్లో వెలుగులు నింపారు. తెలంగాణ ముదిరాజ్, బెస్త ల ఆర్థిక పరిపుష్టి సాధించాలనే లక్ష్యంతో చెరువుల్లో ఉచితంగా చేప పిల్లల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ రంగంపై ఆదారపడ్డ సుమారు నాలుగు లక్షల మంది మత్స్యకారులకు 100 శాతం సబ్సిడీతో చెరువుల్లో చేపలు పెంచుతున్నారు. మార్కెట్ ల నిర్మాణం చేపట్టి ఉపాధికి  కృషి చేసిన మనసున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కి కృతజ్ఞాభివందనాలు.

బీసీల ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి 5 ఎకరాల స్థలంలో 10 కోట్ల నిదులతో నిర్మించుకోవటం జరిగింది.

వృత్తినే జీవనాదారంగా చేసుకుని జీవిస్తున్న కులవృత్తి వర్గాలకు తెలంగాణ ప్రభుత్వం చేయూతనందిస్తుంది. గౌడన్నలకు, గొర్రె పెంపకం దారులకు, మత్స్యకారుల కుటుంబాలకు, చేనేత కార్మికులకు 6 బీమా కల్పిస్తూ బీసీలకు అండగా నిలబడ్డ ముఖ్యమంత్రి కేసీఆర్ 

కి కృతజ్ఞతలు. గౌడన్నల ఉపాధి కోసం స్వచ్చమైన కల్లు అందించేలా కల్లు దుకాణార పునరుద్దరణ చేపడుతూ గీతకార్మికులకు అండగా నిలిచింది ప్రభుత్వం. గీత కార్మిక భవనం నిర్మాణానికి కోకాపేటలో 5 ఎకరాల స్థలం  నిదులు కేటాయించారు. చేనేతల చేయూత కోసం అనేక కార్యక్రమాలను చేపట్టింది. సుమారు 21585 చేనేత కార్మికులకు,43104 మంది పవర్ లూమ్ కార్మికులను గుర్తించి వారికి జియోటాగింగ్ ఇచ్చి ప్రభుత్వ పథకాలను పారదర్శకంగా అందేలా కృషి చేసారు. సబ్సిడి, చేనేత ముడిసరుకులు, నూలు, సిల్కు, ఉన్ని డై రసాయనాల కొనుగోలుకు ఇస్తున్న సబ్సిడిని 20% నుండి 40% పెంచిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. 

 ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో స్వల్ప సంఖ్యలో గురుకుల పాఠశాలలు ఉండేవి. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక 310 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి నాఖ్యమైన కార్పోరేట్ స్థాయి ఉచిత విద్యను అందిస్తుంది ప్రభుత్వం, ఓవర్సీస్ స్కాలర్ షిప్ ల ద్వారా బీసీ బిడ్డల విదేశి విద్యకు సహకరిస్తున్న ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు చెప్పారు. బీసీ లకు సంక్షేమం, విద్య, ఉద్యోగాలలో అవకాశాలు , స్థానిక సంస్థలు,నామినేటెడ్ పదవుల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి కృతజ్ఞతలు తెలిపారు. 

 బీసీల పక్షపాతి సీఎం కేసీఆర్.బీసీలను అగ్రభాగాన నిలబెడుతూ అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కి కృతజ్ఞతలు. రేషన్ డీలర్ల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుంది. అయితే రేషన్ డీలర్లకు పలు సమస్యల తమ దృష్టికి తీసుకువచ్చారు. వారు తెలంగాణ ఉద్యమంలో పనిచేసారు. కరోనా కష్టకాలంలో సేవలందించి 40 మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. రేషన్ డీలర్లకు ఔట్ సోర్సింగ్ లాగా వేతనం లేదా కమీషన్ పెంపు చేపట్టే విదంగా పరిశీలించవలసిందిగా సంబంధిత మంత్రి కి, ముఖ్యమంత్రి కేసీఆర్ కి విజ్ఞప్తి చేస్తున్నాను..

ప్రతిపక్షంలో ఉన్న బీసీ నేతలకు సోయి లేకున్నా బీసీలకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమాభివృద్ది కార్యక్రమాలపై చర్చకు నాకు అవకాశం కల్పించిన స్పీకర్ కి,ముఖ్యమంత్రి కేసీఆర్ కి కృతజ్ఞతలు తెలిపారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: