మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
పెద్దపల్లి కలెక్టర్ కు విన్నపంరామగుండం మున్సిపల్ కార్పొరేషన్ తొలి మాజీ మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ
పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కు తెలియజేయునది విషయం ఏమనగా రామగుండం మండలానికి సంబంధించి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ 2016లో ముగిసినది.
ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల మేరకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు కొరకు ఇంచార్జ్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో దరఖాస్తులు ఆహ్వానించి ఉన్నారు రామగుండం మండల రెవెన్యూ అధికారుల నేతృత్వంలో దరఖాస్తుల ప్రక్రియ కొనసాగింది దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగిసిన తర్వాత అర్హులను గుర్తించి నగరపాలక సంస్థ కార్యాలయంలో రెవెన్యూ మున్సిపల్ అధికారుల ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధుల సమక్షంలో మాకు గుర్తున్న ప్రకారం 16 మే 2016 రోజున డ్రా చేసిరామగుండం పట్టణ ప్రాంతానికి రెండు వందల నలభై మందిని గ్రామీణ ప్రాంతానికి 160 మందిని లబ్ధిదారులుగా ఎంపిక చేసినాము
నాడు ప్రజాప్రతినిధులుగా ఉన్న మేము *ఇందుకు సాక్ష్యం*నాటి నుండి నేటి వరకువారు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు
ఈ క్రమంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కొరకు దరఖాస్తులను మీసేవ కేంద్రాల ద్వారా సమర్పించవలసిందిగా కొత్తగా రామగుండం తహసిల్దార్ తాజాగా ప్రకటన జారీ చేయడంతో ఇదివరకే ఎంపికైన లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. కావున
రామగుండం మండల రెవెన్యూ అధికారుల వద్ద గతంలో ఎంపిక చేయబడిన లబ్ధిదారుల జాబితా ఉంది అదే జాబితాలో ఈ లేఖ వెంట జతపరుస్తున్నాము.
జాబితాలో ఉన్నవారు నిరుపేదలు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కొరకు గత ఏడు సంవత్సరాలుగా ఆశతో ఎదురుచూస్తున్నారు.
కావున అట్టి జాబితాలో ఉన్న వారి వివరాలపై అవసరమైన పత్రాలతో ఉన్నారు విచారణ జరిపి ఆ నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు దక్కాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షలకు అనుగుణంగా తప్పనిసరిగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించి వారికిన్యాయం చేయాలని కోరారు

Post A Comment: