ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ 


హన్మకొండ ;

2018 జులై 30న నిందితుడు అయినటువంటి గాలి ప్రవీణ్ కుమార్, దుడ్డి ఏసోబు అనే వ్యక్తిని సెంట్రింగ్ పరాట చెక్క రన్నర్ తో తలపై కొట్టి మర్డర్ చేయడం జరిగింది.

ప్రవీణ్ కుమార్  అక్కతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని నిందితుడు దుడ్డి ఏసోబు అనే వ్యక్తిని చంపడం జరిగింది.

ఇరువురు ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం త్రోవగుంట గ్రామానికి చెందినవారు.

రేగొండ మండలం గుట్ట కింది రావులపల్లి సమీపంలోని పాండవుల గుట్ట వద్ద గల సబ్ స్టేషన్ నిర్మాణం కోసం సెంట్రింగ్ పని చేయడం కోసం వీరు వచ్చారు.

దుడ్డి ఏసోబుతో పనిచేయడానికి వచ్చినటువంటి తన బంధువైనటువంటి బత్తిని దనియాల్ అనే వ్యక్తి  ఫిర్యాదు మేరకు రేగొండ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగింది.

అప్పటి ఎస్సై ఎన్. సుధాకర్  కేసు నమోదు చేయగా అప్పటి చిట్యాల సిఐ 

 ఎస్.శ్రీనివాస్  ఇన్వెస్టిగేషన్ చేసి కోర్టు నందు ఛార్జ్ షీట్ దాఖలు చేయడం జరిగింది.

ఈ కేసును వాదించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్  జి శివరాజ్

ఈ కేసులో జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రిన్సిపల్  అండ్ సెషన్స్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి పి.నారాయణ బాబు  తీర్పు వెలువరించారు.

ఈ కేసులో సమర్థవంతమైన వాదనలు వినిపించిన పిపి శివరాజు,  కోర్టు నందు విచారణ సరిగ్గా జరగడానికి, సాక్షులను సమయానికి కోర్టులో హాజరు పరిచే విషయంలో మరియు సాక్షులను సరిగ్గా బ్రీఫ్ చేసి సాక్ష్యం చెప్పేలా చేసినటువంటి చిట్యాల సిఐ  పులి వెంకట్ మరియు రేగొండ ఎస్ఐ  శ్రీకాంత్ రెడ్డి, సాక్షులలో కోర్టు నందు హాజరు పరిచినటువంటి కోర్టు కానిస్టేబుల్ పేరు సిహెచ్.జ్యోతినీ, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి  జె. సురేందర్ రెడ్డి  అభినందించడం జరిగినది.

ఇట్టి కేసు నందు నిందితుడు కోర్టుకు హాజరు కాకపోగా ఇతనిపై కోర్టు నాన్ బెయిలబుల్   వారంట్ ఇష్యూ చేయగా,  నిందితుడిని రేగొండ ఎస్సై శ్రీకాంత్ రెడ్డి మరియు హోంగార్డు తిరుపతి ప్రకాశం జిల్లా ఒంగోలు మండలంలోని త్రోవగుంట కి వెళ్లి నిందితుడిని  అరెస్టు చేసి తీసుకువచ్చి కోర్టు నందు హాజరుపరచగా ఇతనికి జ్యూడిషియల్ కస్టడీ విధించి, ట్రయల్ నడపడం జరిగినది.

సాక్షులను విచారించిన మెజిస్ట్రేట్  నిందితుడికి జీవిత ఖైదు విధించడం జరిగింది.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: