మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 


రామగుండం పోలీస్ కమీషనరేట్,  పెద్దపల్లి జిల్లాలోని రామగుండంలో ఉన్న పోలీసు కమీషనరేట్. మంచిర్యాల, రామగుండం, గోదావరిఖని పట్టణ ప్రాంతాలలో చట్ట అమలుకు, దర్యాప్తులో ప్రాథమిక బాధ్యతలను కలిగి ఉన్న ఒక నగర పోలీసు విభాగం. రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలో పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలు ఉన్నాయి. దీనికి రెమా రాజేశ్వరి ఐ.పి.ఎస్. పోలీస్ కమీషనర్ గా భాద్యతలు తీసుకున్న కొద్ది కాలంలోనే డి.ఐ.జి. గా పదోన్నతి పొందడం గొప్ప విషయం. ఈ శుభసందర్బంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి గురించి తెలుసుకొని వ్రాస్తున్న కొన్ని విషయాలు... ఆంధ్రప్రదేశ్‌ క్యాడర్‌గా మొదలైన ఆమె కెరీర్‌ తెలంగాణ క్యాడర్‌లో కొనసాగుతోంది. కృష్ణా పుష్కరాల నిర్వహణలో తెలంగాణ ముఖ్యమంత్రి  కేసీఆర్‌ నమ్మకాన్ని నిలబెట్టారు, సైబరాబాద్‌ డి.సి.పి గా ఈవ్‌టీజింగ్‌ను అరికట్టడానికి షీ టీమ్‌లో పని చేశారూ ఈ బ్రేవ్‌ సూపర్‌ కాప్‌. రంగారెడ్డి జిల్లాలో  ఆపరేషన్‌ స్మైల్‌  ప్రోగ్రామ్‌లో వలస వచ్చిన బాల కార్మికులను బడిబాట పట్టించారు. సేవింగ్‌ చైల్డ్‌ బ్రైడ్‌ క్యాంపెయిన్‌ చేపట్టి నాలుగు వందల మంది అమ్మాయిలను బాల్య వివాహాల నుంచి విముక్తి కలిగించారు. వాళ్ల పేరెంట్స్‌కి కౌన్సెలింగ్‌ ఇచ్చి ఆ అమ్మాయిలను మళ్లీ బడిలో చేర్పించారు. గ్రామస్తుల్లో ఒకరిగా కలిసిపోయారు. వారితోపాటు బతుకమ్మను మోశారు, పాట పాడుతూ ఆట ఆడారు, జోగినులకు కొత్త జీవితాన్నివ్వడం, దత్తత తీసుకున్న గ్రామాన్ని అభివృద్ధి చేయడం, పిల్లలకు, మహిళలకు ఎదురయ్యే సమస్యల మూల కారణాల మీద కొరడా ఝళిపించడం వంటివన్నీ తొలి దశాబ్దంలోనే సొంతం చేసుకున్నారు. రెమా రాజేశ్వరి ఐ.పి.ఎస్ పుట్టింది కేరళ రాష్ట్రం మున్నార్‌ జిల్లా ఇడుక్కిలో. తండ్రి రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో, తల్లి టీచింగ్‌ ప్రొఫెషన్‌లో ఉన్నారు. వాళ్ల ఉద్యోగాలతో వాళ్లు బిజీగా ఉంటే తనను పెంచడంలో అమ్మమ్మ పార్వతి రోల్‌ కీలకమైంది, తనలో భవిష్యత్తు మీద ఒక గురిని ఏర్పరిచింది. స్కూల్‌ కోసం రోజూ పదిహేను కిలోమీటర్ల దూరం నడిచేది,  గ్రాడ్యుయేషన్‌ తర్వాత సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తూ పోలీస్‌ మేనేజ్‌మెంట్‌లో పీజీతో పాటు సివిల్స్‌కి ప్రిపేరయ్యారు. సమాజంలో మహిళలకు, పిల్లలకు, కామన్‌ మ్యాన్‌కు ఎదురయ్యే సమస్యలను తీర్చే అవకాశం ఐఏఎస్‌ అయితేనే సాధ్యం అనే నమ్మకం తనది. తన, తన అమ్మమ్మ కోరిక

 కలెక్టర్ కావాలని కానీ... ఐ.పి.ఎస్. వచ్చినా సమాజ శ్రేయస్సు పనులెన్నో చేశారు. తన స్వస్థలం ఇడుక్కి నుంచి ఐపీఎస్‌ అయిన తొలి మహిళ తనే. రేమా రాజేశ్వరి 2009 బ్యాచ్‌ ఐపీఎస్‌ ఆఫీసర్‌. హైదరాబాద్‌లో ట్రైనింగ్‌. రంగారెడ్డి, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, జోగుళాంబ గద్వాల్‌, నల్గొండ జిల్లాల్లో బాధ్యతలు చేపట్టారు. తమిళ, మలయాళ, తెలుగు, పంజాబీ, ఇంగ్లిష్, హిందీ భాషలు మాట్లాడతారామె. ఏ సమాజమైనా బాధితులు స్త్రీలు, పిల్లలే అని అర్థమైంది. అందుకే ఆమె డిజైన్‌ చేసిన ప్రోగ్రామ్‌లన్నీ మహిళలు, కుటుంబాల శ్రేయస్సునే కోరుతూ ఉంటాయి. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యతను భుజానికెత్తుకుని గురి తప్పని షూటర్‌లా లక్ష్యాలకు చేదిస్తుంది. ఐపీఎస్‌ అయినప్పటికీ తన దృష్టి ఎప్పుడూ సామాజికాంశాల మీదనే లగ్నమవుతుంటుంది. సివిల్‌ సర్వెంట్‌గా సోషల్‌ ఇష్యూస్‌ని పరిష్కరించే దారులనే వెతుకు తుంటాయి నా కళ్లు అంటోంది రెమా రాజేశ్వరి. పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో మహిళల సంఖ్య పెరగాలని తాను ఇస్తున్న నివేదికకు ఇలాంటి సంఘటనలన్నీ కారణమే. అందుకే సెక్యూరిటీ ఫోర్సెస్‌లో కూడా జెండర్‌ ఈక్వాలిటీ ఉండాలంటారు రెమా రాజేశ్వరి.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: