మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
గోదావరిఖని స్థానిక లక్ష్మీనగర్లోని రీగల్
షూమార్ట్ కూడలి వద్ద సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు "బొంతల రాజేష్" ఆధ్వర్యంలో జరిగిన "74వ గణతంత్ర దినోత్సవ" వేడుకలకు ముఖ్య అతిథిగా పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు "మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్" హాజరై, జెండా ఆవిష్కరణ చేసిన అనంతరం మాట్లాడుతూ,,, రామగుండం నియోజకవర్గం ప్రజలందరికీ, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు 74వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలని తెలుపుతూ, భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతీ ఒక్కరూ రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ప్రజాస్వామ్య పరిరక్షణే ధ్యేయంగా ముందుకు సాగాలని కోరుకుంటూ,
ప్రపంచంలోనే అతిపెద్దదైన మన రాజ్యాంగం అమలులోకి వచ్చిన ఈరోజున భారత రాజ్యాంగం నిర్మాణంలో డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కృషిని గుర్తుచేసుకుంటూ, ప్రతీ ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రాజ్యాంగ బద్ధంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు..
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాదరబోయిన రవికుమార్, కార్పొరేటర్లు మహంకాళి స్వామి, ఎండీ ముస్తఫా, బీసీ సెల్ అద్యక్షులు గట్ల రమేష్, ఎస్ సీ సెల్ అద్యక్షులు తాల్లపెల్లి యుగేందర్, మాజీ కార్పొరేటర్లు చుక్కల శ్రీనివాస్, పాతిపెల్లి రవి యాదవ్,నాయకులు గడ్డం శేఖర్, సమ్మెట స్వప్న, మైనారిటీ సెల్ అద్యక్షులు నజీమొద్దిన్,మేకల పోషం, ఎండీ యాకూబ్, ధూళికట్ట సతీష్, నజీం, ఆరిఫ్, కధీర్, సొల్లు రామస్వామి, గట్టు విజయ్, నల్ల వినోద్, రాసమల్ల కిరణ్, గుడికందుల రవి, బండి చందు, మాదరవవేని కిరణ్, రాపెల్లి కార్తిక్, కెంగర్ల కుమార్, పీక అరుణ్,& అధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Post A Comment: