మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
సింగరేణి యాజమాన్యం ఓసిపి 5లో ప్రతిరోజు 3.30 నిమిషాలకు మోతాదుకు మించి భారీ బ్లాస్టింగ్లు చేస్తుండడంతో చుట్టూ ప్రాంత ప్రజలు ఇళ్లలో ఉండలేని పరిస్థితి ఏర్పడుతుందని ఈ బ్లాస్టింగ్లతో ఇంట్లో సామాగ్రి కింద పడుతున్నాయని కాలనీవాసులు ఇళ్ల నుంచి బయటికి వచ్చి ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమని బతుకుతున్న పరిస్థితి దుమ్ము ధూళి ఆహార పదార్థాలపై నీటిపై పడటం వలన కాలుష్యంతో శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నారని డిసెంబర్ 23వ తేదీన డైరెక్టర్ ఆఫ్ జనరల్ మైనింగ్ సేఫ్టీ ధన్బాద్కు స్థానిక కార్పొరేటర్ పెద్దెల్లి తేజస్వి ప్రకాష్ ఫిర్యాదు చేయడం జరిగింది ఈ ఫిర్యాదుకు స్పందించి డిజిఎంఎస్ డిప్యూటీ డైరెక్టర్లు కమలేశ్వర్ వర్మ సనత్ కుమార్ 1.2.2023 మధ్యాహ్నం 12 గంటలకు ఓసిపి5 కి వచ్చి పరిశీలించనున్నారు కావున ఇక్కడ ఉన్న ప్రజలందరూ నాయకులు వచ్చి బ్లాస్టింగ్ వలన జరిగే నష్టాలను డీజీఎంఎస్ డైరెక్టర్లకు అధికారులకు తెలియజేయాలని కోరుతున్నామని పెద్దెల్లి తేజస్వి ప్రకాష్ కోరారు..
Post A Comment: