మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
విలేజి రామగుండంకు చెందిన పీపుల్స్ వార్
(మావోయిస్ట్) సికాస మాజి నాయకులు దయా రాజారాం తీవ్రఅనారోగ్యంతో బాదపడుతూ వైద్యం కోసం చేతిలో చిల్లిగవ్వలేక గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రిలో బెడ్ పై దీనస్థితిలో గడుపుతున్నాడు. సికాస (కోల్ బెల్ట్)కార్యదర్శి కట్లమల్లేశ్ అలియాస్ రమాకాంత్ నేతృత్వంలో రామగుండం కోల్ బెల్ట్ ప్రాంతంలో వార్(సికాస)బలోపేతం కొసం తొలితరం
ఉద్యమనిర్మాణంలో ఎన్టీపీసీలో కాంట్రాక్ట్ కార్మికుల కోసం లొకేషన్లో ఉండడం కోసం ఆ రోజుల్లో కాంట్రాక్టర్లందర్నీ ఒక తాటిపైకి తీసుకువచ్చి ఎన్ టి పి సి లో కార్మికులను తీసివేయకుండా పోరాటం చేయడంలో రాజారాం కీలకపాత్ర నిర్వహించారు.నిస్వార్ధంగా పనిచేస్తూ ఆపదలో ఉన్న ఎందరో రాజకీయ నాయకులకు
అండగా నిలిచారు మావోయిస్టు పార్టీలో ఇప్పటికీ సుస్థిర స్థానం సంపాదించుకున్న వ్యక్తి అలాంటి వ్యక్తి.అనారోగ్యం మూలంగా ప్రభుత్వానికి లొంగిపోయి సాధారన జీవితం గడుపుతున్నారు.ఉన్నంతలో రాజారాం కుటుంబ సభ్యులు హైదరాబాద్ ఆస్పత్రులలో డబ్బులు ఖర్చు చేసి మెరుగైన వైధ్యం అందించినప్పటికి పలితం లేకపోవడం డబ్బులు పెట్టె స్థోమతలేక గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు.అందరి కోసం అనుకున్న లక్ష్యంకోసం విప్లవోధ్యమ బాటపట్టిన రాజారాం జీవితంలో ఓడిపోయి అనారోగ్య చీకట్లుముసిరి ధీనస్థితిలో ఆర్థికసహయంకోసం చేతులు చాచాల్సిన పరిస్థితి దాపురించింది.దాతలు
విప్లవసానుభూతిపరులు ఎవరైనా తనకు ఆర్థిక సహయం అందించి ఆదుకోవాలని రాజారాం వేడుకుంటున్నారు.తనఫోన్.6302729381 కితోచిన సహయం డబ్బుల రూపంలో అందించాలను మిత్రులను దాతలను రాజారాం వేడుకుంటున్నారు.

Post A Comment: