మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం అంబేద్కర్ చౌక్ వద్ద నిమ్మరాజుల రవి ఆధ్వర్యంలో జరిగిన సన్మాన కార్యక్రమాని ముఖ్యఅతిథిగా బిజెపి రాష్ట్ర నాయకులు కార్మిక నేత కౌశిక హరి హాజరై (డా"బి.ఆర్ అంబేద్కర్ జాతీయ అవార్డు గ్రహీత), ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు భూషిపాక సంతోష్ మాహరజ్ ను ఘనంగా సన్మానించి అభినందనలు తెలియజేశారు
ఈ సందర్భంగా *కౌశిక హరి*మాట్లాడుతూ
రామగుండం ముద్దుబిడ్డ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి పెద్దపెల్లి జిల్లా అధ్యక్షుడు భూష్పక సంతోష్ మహారాజ్ కు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జాతీయ అవార్డు రావడం చాలా సంతోషకరమని, సమాజంలో బలహీన వర్గాల హక్కులను కాపాడాలని, ఎస్సీల యొక్క రిజర్వేషన్ అన్యాక్రాంతం కాకుండా చూడాలని, అంబేద్కర్ యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని, దళిత బడుగు బలహీన వర్గాలకు ఎక్కడ సమస్య వచ్చిన ముందుండి పనిచేయాలని అన్నారు....
*భుష్పక సంతోష్ మాట్లాడుతూ బిజెపి రాష్ట్ర నాయకులు కార్మిక నేత, నిరంతరం ప్రజల్లో ఉంటూ, ప్రజా సంక్షేమాన్ని కోరుకునే ప్రజల మనిషి, కౌశిక హరన్న నాకు నేషనల్ అవార్డు వచ్చిన సందర్భంగా నన్ను సన్మానించడం సంతోషకరమైన విషయం మీరు ఇస్తున్నటువంటి ప్రోత్సాహంతో రానున్న రోజులలో అంబేద్కర్ ఆశయ సాధన కోసం, పేద దళిత బడుగు బలహీన వర్గాలకు ప్రజలకు దగ్గరగా ఉంటూ, ఉద్యమ పోరాటాలు, సేవ సహాయ కార్యక్రమాలు, చేస్తానని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు ధారంగుల కుమార్, కుక్కల గూడూరు మాజీ సర్పంచ్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు పొన్నం సత్తయ్య గౌడ్, నిమ్మరాజుల రవి, బోనగిరి కుమార్, పులి శ్రీనివాస్, ఎస్సీఆర్పిఎస్ జిల్లా యూత్ ప్రెసిడెంట్ ప్రేమ్ కుమార్, జిల్లా కార్యదర్శి శ్రీమన్, తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Post A Comment: