ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ 


హన్మకొండ ;

మంత్రి స్వగ్రామం పర్వతగిరిలో ఇస్కాన్ శ్రీరామ్ విజయోత్సవ శోభాయాత్ర కన్నుల పండువగా జరిగింది. అడుగడుగునా హారతులతో పర్వతగిరి వాసులు శ్రీరామునికి ఘన స్వాగతం పలికారు. దారి పొడవునా భజనలతో భక్తులు తమ భక్తి భావాన్ని ప్రదర్శించారు.

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు , స్థానిక ఎమ్మెల్యే ఆరూరి రమేష్  శోభాయాత్రలో పాల్గొని దారి పొడవునా భక్తులతో మమేకం అయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే అరూరి రమేష్  మాట్లాడారు.

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ 

ఇస్కాన్ శోభా యాత్రతో పర్వత గిరికి రాముడు వచ్చినట్టే ఉంది. నేను ఈ గ్రామ ముద్దు బిడ్డను. ఇక్కడకు రాముడు రావడం మన అదృష్టం.

ఇస్కాన్ శోభా యాత్ర పాలకుర్తిలో, వావిలాలల్లో బ్రహ్మాండంగా జరిగింది. అనంతరం తొర్రూరులో ఇస్కాన్ శోభాయాత్ర అద్భుతంగా జరిగింది.నేడు పర్వత గిరిలో కన్నుల పండువగా జరిగింది. ఇస్కాన్ సంస్థ వాళ్ళు దేశం అంతా మంచి సేవలు చేస్తారు. పర్వత గిరిలో ఇంటింటికీ మంగళ హారతులతో స్వాగతం పలికారు. దీనివల్ల గ్రామానికి మంచి జరుగుతుంది. 2023 జనవరి 26,27,28 తేదీల్లో పర్వతాల గుట్ట శివాలయం పునః ప్రారంభం ఘనంగా చేస్తున్నాం. 10 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆలయం గొప్పగా అభివృద్ది చేస్తున్నాం. కాకతీయ రాజులు ఇక్కడ పర్వతాల మధ్య ఉన్న శివుణ్ణి కొలిచిన చరిత్ర ఉంది. కాల క్రమేణా ఈ శివాలయం పూడుకుపోయింది. ఇప్పుడు దానిని పునరుద్ధరణ చేస్తున్నాం. ఈ శివాలయానికి గొప్ప చరిత్ర ఉంది.కల్లెడ రామ్మోహన్ రావు  బాగా కష్టపడి, ఖర్చు పెట్టి అభివృద్ది చేస్తున్నారు._

నేను కూడా శివాలయానికి వ్యక్తిగతంగా కోటి రూపాయలు ఇచ్చాను.

2023 జనవరి 26,27,28 మూడు రోజులు భక్తులు ఇంటి నుంచి నీటిని తీసుకొచ్చి శివునికి అభిషేకం చేయాలి. ఆలయ పునః ప్రారంభోత్సవానికి మంత్రి హరీశ్ రావు  వస్తున్నారు. పాలకుర్తి, వర్ధన్నపేట రెండు నియోజక వర్గ ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తారు.పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని సన్నూరు దేవాలయాన్ని 10 కోట్ల రూపాయలతో అభివృద్ది చేస్తున్నాము. ఇస్కాన్ వారికి అక్కడే 10 ఎకరాలు ఇచ్చాను. అల్లా, ప్రభువు, శివుడు, రాముడు, కృష్ణుడు అందరూ దేవుళ్లే.మనస్పూర్తిగా పూజిస్తే మనకు పుణ్యం దక్కుతుంది.

ఇస్కాన్ వారు అడగగానే ఇక్కడకు వచ్చినందుకు వారికి పాదాభివందనాలు.

ఈ కార్యక్రమం విజయవంతం చేయడంలో సహకరించిన వందేమాతరం ఫౌండేషన్, పర్వతగిరి వాసులు, అధికారులకు  ధన్యవాదాలు.

ఎమ్మెల్యే అరూరి రమేష్ మాట్లాడుతూ 

హరే రామ, హరే కృష్ణ సంస్థ ఆధ్వర్యంలో శ్రీరాముని శోభా యాత్ర ఘనంగా జరిగింది.

గొప్పగా స్వాగతం పలికిన స్టానికులందరికీ కృతజ్ఞతలు._

ఈరోజు శుభ దినం. రాజకీయాలకు అతీతంగా శోభా యాత్రలో పాల్గొనడం సంతోషం. మన నియోజక వర్గంలో మిగిలిన చోట్ల కూడా ఈ శోభా యాత్రకొనసాగిస్తాం.ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: